రూ. కోటికి డీల్‌ చేసిన శ్రీనివాస్‌....  క్యాంటీన్‌ సిబ్బంది కీలక విషయాలు

జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రావు వెనుక  భారీ వ్యవహారమే ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. జగన్‌ హత్యకు 8 నెలల ముందు నుంచే ప్రణాళిక రచించారు. టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్లాన్‌ను టీడీపీ పెద్దలు నడిపారు. శ్రీనివాస్‌రావు పనిచేస్తున్న క్యాంటీన్ సిబ్బంది పలు కీలక విషయాలు మీడియాకు చెప్పారు. క్యాంటీన్ సిబ్బంది అంతా వంట గది వద్ద వారి బ్యాగులను ఉంచుకునేవారు. ఒక్క శ్రీనివాసరావుకు మాత్రమే సీసీ కెమెరాల దృష్టి పడని క్యాష్ కౌంటర్‌ […]

Advertisement
Update:2018-10-28 02:39 IST

జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రావు వెనుక భారీ వ్యవహారమే ఉన్నట్టు తేటతెల్లమవుతోంది. జగన్‌ హత్యకు 8 నెలల ముందు నుంచే ప్రణాళిక రచించారు. టీడీపీ నేత హర్షవర్థన్‌ చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్లాన్‌ను టీడీపీ పెద్దలు నడిపారు.

శ్రీనివాస్‌రావు పనిచేస్తున్న క్యాంటీన్ సిబ్బంది పలు కీలక విషయాలు మీడియాకు చెప్పారు. క్యాంటీన్ సిబ్బంది అంతా వంట గది వద్ద వారి బ్యాగులను ఉంచుకునేవారు. ఒక్క శ్రీనివాసరావుకు మాత్రమే సీసీ కెమెరాల దృష్టి పడని క్యాష్ కౌంటర్‌ వద్ద ఉంచుకునేందుకు క్యాంటీన్‌ ఓనర్‌ హర్షవర్థన్‌ చౌదరి అనుమతి ఇచ్చారు.

శ్రీనివాసరావు వారం క్రితమే ఇంటికి వెళ్లి వచ్చారని సిబ్బంది వివరించారు. అలా వెళ్లి వచ్చినప్పటి నుంచి అతడి తీరు అనుమానాస్పదంగానే ఉందని క్యాంటీన్ సిబ్బంది ఒక మీడియా సంస్థకు చెప్పారు. కత్తి కూడా ఆరోజే తెచ్చుకుని ఉండవచ్చన్నారు.

సాధారణంగా శ్రీనివాసరావు డ్యూటీ మధ్యాహ్నం షిప్ట్‌లో ఉంటుందని… కానీ జగన్‌పై దాడి చేసిన రోజు మాత్రం ఉదయం షిప్ట్‌లోనే శ్రీనివాసరావు వచ్చారని వివరించారు. అలా ఎందుకు వచ్చాడో జగన్‌పై దాడి చేసే వరకు తమకు అర్థం కాలేదన్నారు. వారం రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉంటూ వస్తున్న శ్రీనివాసరావు తాను సంచలనం సృష్టిస్తానని పదేపదే చెప్పే వారని వివరించారు.

శ్రీనివాస్‌ రావుకు మిగిలిన సిబ్బంది కంటే ఎక్కువ జీతం ఇచ్చేవారని చెప్పారు. అతడికి ఇంటి అద్దె కూడా హర్షవర్థన్‌ చౌదరే చెల్లిస్తున్నారని వివరించారు. అటు ఆయన సొంతూరులోనూ శ్రీనివాస్‌రావు ఇటీవల చేసిన పనులు చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

ఠానేల్లంక సమీపంలో గోదావరి అవతల కోటి రూపాయలకు నాలుగు ఎకరాలు కొనేందుకు శ్రీనివాసరావు సిద్దమయ్యారు. ఇందు కోసం ఒక భూస్వామితో చర్చలు జరిపారు. భూమిని చూసిన తర్వాత ఓకే చేసిన శ్రీనివాసరావు వారం రోజుల్లో పది లక్షలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పి వెళ్లారు.

ఇంతలోనే జగన్‌పై దాడి చేశాడు. దాంతో అప్పటి వరకు చిల్లరగా తిరిగే శ్రీనివాసరావుకు కోటి రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయని ఆశ్చర్యపోయిన స్థానికులు జగన్‌పై దాడి తర్వాత షాక్‌ అయ్యారు. జగన్‌ను హత్య చేసే ప్రక్రియలో భాగంగానే శ్రీనివాసరావుకు భారీగా డబ్బు అంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. దాంతో పాటు దాడి చేసిన తర్వాత శ్రీనివాసరావు కుటుంబసభ్యులు ఏమాత్రం బెరుకులేకుండా ఉన్నారు.

పోలీసులతో నవ్వుతూ మాట్లాడుతూ కులాసగా ఉన్నారు. శ్రీనివాసరావు తండ్రి టీడీపీ నుంచి ఠానేల్లంక గ్రామంలో తాజా మాజీ ఉప సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాసరావు చిన్నాన్న నాగేశ్వరరావు గ్రామంలో టీడీపీ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటారు.

Tags:    
Advertisement

Similar News