జగన్‌కు నేను చేసింది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే....
జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే టీడీపీ, దాని అనుకూల మీడియా మెరుపువేగంతో కవర్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగా జగన్‌కు తగిలింది చాలా చిన్నగాయమేనంటూ వ్యవహారాన్ని చిన్నది చేసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ చేసిన అపోలో మెడికల్ సెంటర్ డాక్టర్ లలితా స్వాతి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టును, ఆమె ఫోన్ కాల్ రికార్డును వాడుకున్నారు. జగన్‌కు కేవలం 0.5 సెం.మీ మాత్రమే గాయమైందని డాకర్ట్ స్వాతి రిపోర్టు ఇచ్చారంటూ […]
జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే టీడీపీ, దాని అనుకూల మీడియా మెరుపువేగంతో కవర్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందులో భాగంగా జగన్‌కు తగిలింది చాలా చిన్నగాయమేనంటూ వ్యవహారాన్ని చిన్నది చేసేందుకు ప్రయత్నించారు. ఇందు కోసం విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌కు ఫస్ట్ ఎయిడ్ చేసిన అపోలో మెడికల్ సెంటర్ డాక్టర్ లలితా స్వాతి ఇచ్చిన ప్రాథమిక రిపోర్టును, ఆమె ఫోన్ కాల్ రికార్డును వాడుకున్నారు.
జగన్‌కు కేవలం 0.5 సెం.మీ మాత్రమే గాయమైందని డాకర్ట్ స్వాతి రిపోర్టు ఇచ్చారంటూ ప్రచారం చేశారు. ఒక ఆడియో టేపును కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ మీడియా తీరుపై డాక్టర్ లలితా స్వాతి తీవ్రంగా స్పందించారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు.
”జగన్‌పై అటాక్ చేశారు…. వెంటనే రావాలని ఎవరో యువకులు పరుగులు పెడుతూ వచ్చి చెప్పారు. స్టెతస్కోపు, బీపీ మిషన్ తీసుకుని వెంటనే అక్కడికి వెళ్లా. జగన్ తెల్ల చొక్కా మొత్తం రక్తసిక్తమైంది. దాంతో భయపడ్డా. జగన్ ఓపిగ్గా జాగ్రత్త తల్లీ అని చెప్పారు. నేను ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేశా. ఎటువంటి ట్రీట్‌మెంట్ చేయలేదు. సుమారుగా 0.5 సెం.మీ కత్తి దిగిందని రిపోర్టు ఇచ్చా. గాయం అంతకంటే ఎక్కువే ఉండవచ్చని భావించా. పోలీసులు కూడా వెంటనే ఒత్తిడి తెచ్చి రిపోర్టు తీసుకెళ్లారు. ఇలాంటి గాయం అయినప్పుడు విషం ఏమైనా ఉందేమో డాక్టర్లు మరింత లోతుగా పరిశీలించి కుట్లు వేస్తారు. హైదరాబాద్‌లో డాక్టర్లు అదే చేశారు. కానీ నేనేదో పక్కాగా 0.5 సెం.మీ మాత్రమే గాయం అయినట్టు రిపోర్టు ఇచ్చినట్టు కొన్ని టీవీ చానళ్లు ప్రచారం చేసి రిపోర్టును వక్రీకరించాయి” అని లలితా స్వాతి మండిపడ్డారు.