కేసీఆర్, పవన్ కళ్యాన్ రాజకీయాలపై సుమన్ హాట్ కామెంట్స్

ఒకప్పుడు టాప్ హీరో…. మెగాస్టార్ చిరంజీవికి కూడా గట్టి పోటీనిచ్చాడు. కానీ ఆ తర్వాత వ్యక్తిగత విషయాలతో సర్వం కోల్పోయి తెరమరుగయ్యాడు. అనంతరం మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయాడు. అతడే సుమన్. ఈ సీనియర్ యాక్టర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై హాట్ కామెంట్ చేశారు. విశాఖ పట్నం నగరంలో కరాటే చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం వచ్చిన ఈయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ముందుగా […]

Advertisement
Update:2018-10-28 06:30 IST

ఒకప్పుడు టాప్ హీరో…. మెగాస్టార్ చిరంజీవికి కూడా గట్టి పోటీనిచ్చాడు. కానీ ఆ తర్వాత వ్యక్తిగత విషయాలతో సర్వం కోల్పోయి తెరమరుగయ్యాడు. అనంతరం మళ్లీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయాడు. అతడే సుమన్. ఈ సీనియర్ యాక్టర్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై హాట్ కామెంట్ చేశారు. విశాఖ పట్నం నగరంలో కరాటే చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించేందుకు ఆదివారం ఉదయం వచ్చిన ఈయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలపై తన మనోగతాన్ని వెల్లడించారు.

ముందుగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో తన మద్దతు టీఆర్ఎస్ కే అని సుమన్ స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని.. తెలంగాణ ముఖ్యమంత్రి గా మళ్లీ కేసీఆరే రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో పోరాడిన కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయాడని.. ఇప్పుడు అభివృద్ధి చేస్తూ అంతే స్థాయిలో పేరు పొందుతున్నాడని ప్రశంసించారు.

ఇక ఏపీ రాజకీయాలపై కూడా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తోటి హీరో, ప్రస్తుత రాజకీయ నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ రాజకీయంపై మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదాపై గళమెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడా విషయం ఎందుకు మరిచిపోయాడని సుమన్ ప్రశ్నించారు. భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజాదరణ ఉన్న పవన్ హోదా కోసం గట్టిగా పోరాడితే కేంద్రం దిగివస్తుంది కదా అని సూచించారు. ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆయన అభిమానులతో కలిసి ఆందోళన చేస్తే ఫలితం ఉంటుందని.. ఇలా మౌనంగా ఉండడం సరికాదని సుమన్ హితవు పలికారు.

Tags:    
Advertisement

Similar News