నవంబర్ 1న కాంగ్రెస్ జాబితా విడుదల !
కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత కార్యక్రమం పూరైంది. గెలుపు గుర్రాలే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. నవంబర్1న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. అదే రోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో ప్రకటించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ క్యాండిడేట్స్ వడపోతను పూర్తి చేసింది. అభ్యర్థుల తుదిలిస్ట్‌ను రెడీ చేసింది. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పీసీసీ, ఏఐసీసీ చేసిన సర్వే రిపోర్టుతో పాటు […]
కాంగ్రెస్ అభ్యర్థుల వడపోత కార్యక్రమం పూరైంది. గెలుపు గుర్రాలే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది. నవంబర్1న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. అదే రోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు రాష్ట్రంలో ప్రకటించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ క్యాండిడేట్స్ వడపోతను పూర్తి చేసింది. అభ్యర్థుల తుదిలిస్ట్‌ను రెడీ చేసింది.
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. పీసీసీ, ఏఐసీసీ చేసిన సర్వే రిపోర్టుతో పాటు స్థానికంగా అభ్యర్థుల బలాబలాలు, ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ విదేయత…. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించిన కమిటీ…. అభ్యర్థుల వడపోతను పూర్తి చేసింది. అంతేకాకుండా రెబెల్స్ రంగంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంది. అభ్యర్థుల జాబితా ప్రకటించేలోపు మహాకూటమి సీట్ల సర్దుబాటు పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్ తొలి జాబితా
1)హుజుర్ నగర్ – ఉత్తమ్‌కుమార్ రెడ్డి
2)నాగార్జునసాగర్ – జానా రెడ్డి
3)మధిర – మల్లు భట్టి విక్రమార్క
4)నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
5)గద్వాల – డీకే అరుణ
6)అలంపూర్ – సంపత్ కుమార్
7)కొడంగల్ – రేవంత్ రెడ్డి
8)మంథని – శ్రీధర్ బాబు
9) పరిగి – రామ్మోహన్ రెడ్డి
10)నర్సంపేట – దొంతి మాధవ రెడ్డి
11)జహీరాబాద్ – గీతా రెడ్డి
12)కల్వకుర్తి – వంశీచందర్ రెడ్డి
13)వనపర్తి – చిన్నారెడ్డి
14) జగిత్యాల – జీవన్ రెడ్డి
15) బోధన్ – సుదర్శన్ రెడ్డి
16) ఆర్మూర్ – ఆకుల లలిత ( ప్రస్తుతం ఎమ్మెల్సీ )
17) నిజామాబాద్ టౌన్ -మహేష్ కుమార్
18) కామారెడ్డి – షబ్బీర్ అలీ
19) నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి
20) సంగారెడ్డి – జగ్గారెడ్డి
21) నర్సాపూర్ -సునీత లక్ష్మారెడ్డి
22) ఆందోల్ -దామోదర రాజనర్సింహ
23) హుస్నాబాద్ – ప్రవీణ్‌రెడ్డి లేదా సీపీఐ
24) ఎల్బీనగర్ -సుధీర్ రెడ్డి
25) కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్
26) రాజేందర్ నగర్ – కార్తీక్ రెడ్డి( టీడీపీ ఈ సీటు అడుగుతోంది)
27) మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
28)ఉప్పల్ – టీడీపీ
29) జనగామ – పొన్నాల లక్ష్మయ్య
30) వర్ధన్నపేట – కొండేటి శ్రీధర్
31) ములుగు – సీతక్క
32) భూపాలపల్లి – గండ్ర వెంకటరమణా రెడ్డి
33) డోర్నకల్ – రామచంద్రనాయక్
34) స్టేషన్ ఘన్ పూర్ – విజయరామారావు / ఇందిరా
36) పాలకుర్తి – జంగా రాఘవరెడ్డి
37) మహబూబాబాద్ – బలరాం నాయక్ / ఉమా మురళీ నాయక్
38) పినపాక – రేగా కాంతారావు
39) ఆలేరు – బిక్షమయ్య గౌడ్
40) భువనగిరి – కుంభం అనిల్ రెడ్డి / జిట్టా బాలకృష్ణా రెడ్డి
41) దేవరకొండ – బాలు నాయక్ / బిల్యనాయక్
42) మిర్యాలగూడ – రఘువీర్ రెడ్డి / అమరేందర్ రెడ్డి
43) నాగర్ కర్నూల్ – నాగం జనార్దన్ రెడ్డి
44) అచ్చంపేట – డాక్టర్ వంశీకృష్ణ
45) దేవరకద్ర – పవన్ కుమార్ రెడ్డి
46)షాద్ నగర్ – ప్రతాపరెడ్డి
47) కొల్లాపూర్ – హర్షవర్ధన్ రెడ్డి
48) నారాయణపేట – శివ కుమార్ రెడ్డి
49) తాండూరు – పైలట్ రోహి త్ / ఆర్. కృష్ణయ్య
50) మానకొండూరు – ఆరెపల్లి మోహన్
51) కంటోన్మెంట్ – శ్రీశాంక్
52) పెద్దపల్లి – చింతకుంట విజయ రమణారావు
53) సిరిసిల్ల – కెకె మహేందర్ రెడ్డి
54) చెన్నూరు – బోడ జనార్ధన్/ ఎన్. వెంకటేష్
55) అసిఫాబాద్ – ఆత్రం సక్కు
56) బోథ్ – సొయం బాపురావు
57) మెదక్ – శశిధర్ రెడ్డి / నర్సారెడ్డి ( గజ్వెల్)
58) గజ్వేల్ – ప్రతాపరెడ్డి
59) తుంగతుర్తి – అద్దంకి దయాకర్
60) చొప్పదండి – గజ్జెల కాంతం
61. శేరిలింగంపల్లి – భిక్షపతి యాదవ్
62. ఖానాపూర్ – రమేష్ రాథోడ్
63.ఆదిలాబాద్రా – మచంద్ర రెడ్డి / గండ్ర సుజాత
64. మంచిర్యాల – అరవింద్ రెడ్డి/ ప్రేమ సాగర్ రావు
65. ఎల్లారెడ్డి – బి. సుభాష్ రెడ్డి/ జే. సురేందర్
66. జుక్కల్- అరుణ తార/ గంగారాం
67. కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
68. ధర్మపురి – లక్ష్మణ్ కుమార్
69. వేములవాడ – ఆది శ్రీనివాస్
70. హుజురాబాద్ – కౌశిక్ రెడ్డి
71. నారాయణఖేడ్.. షెట్కార్
72. దుబ్బాక – ముత్యం రెడ్డి
73. మేడ్చల్ – కెఎల్ఆర్
74. ఇబ్రహీంపట్నం – మల్ రెడ్డి
75. చేవెళ్ల – మాజీ మంత్రి చంద్రశేఖర్
76. ముషీరాబాద్ – అంజన్
77. ఖైరతాబాద్ – రోహన్ రెడ్డి
78. గోశామహల్ – ముఖేష్ గౌడ్
79. ముధోల్ – నారాయణ పటేల్
80. జడ్చర్ల – మల్లు రవి/ టీడీపీ
81. మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
82. సూర్యాపేట – దామోదర్ రెడ్డి
83 కొత్తగూడెం – వనమా/ సీపీఐ
84. ఖమ్మం – రవి చంద్ర / టీడీపీ
85. పాలేరు – సుచరిత రెడ్డి
86. వైరా – మంగిలాల్ నాయక్
87. వరంగల్ వెస్ట్ – నాయిని రాజేందర్ రెడ్డి/ వేం నరేందర్ రెడ్డి
88. పరకాల – కొండా సురేఖ
ఇప్పటివరకూ ఈ సీట్లు ఖరారైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు కూడా జరగొచ్చు. మహాకూటమి సీట్ల సర్దుబాటు జరిగితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.