తెలంగాణలో పట్టుబడ్డ ఏపీ పోలీసులు....
చంద్రబాబు ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోతోంది. ఏపీ పోలీసులను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పినా పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్…. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కూటమిని గెలిపించేందుకు వంద మంది సిబ్బందిని హైదరాబాద్‌లో మోహరించింది. ఒక ప్రముఖ పత్రికాధినేత ద్వారా తెలంగాణ ఎన్నికల్లో 500 కోట్లు డబ్బు పంచేందుకు చంద్రబాబు ఆ డబ్బును ఇప్పటికే డంప్ చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ […]
చంద్రబాబు ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ పరువు గంగలో కలిసిపోతోంది. ఏపీ పోలీసులను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని చంద్రబాబు రాజకీయం కోసం వాడుకుంటూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పినా పట్టించుకోని ఏపీ ఇంటెలిజెన్స్…. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ కూటమిని గెలిపించేందుకు వంద మంది సిబ్బందిని హైదరాబాద్‌లో మోహరించింది.
ఒక ప్రముఖ పత్రికాధినేత ద్వారా తెలంగాణ ఎన్నికల్లో 500 కోట్లు డబ్బు పంచేందుకు చంద్రబాబు ఆ డబ్బును ఇప్పటికే డంప్ చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ పోలీసులు పట్టుబడడం కలకలం రేపింది.
ఎన్నికల నేపథ్యంలోనే తాము ఇక్కడికి వచ్చినట్టు వారు వివరించారు. పట్టుబడిన వారిలో ఒక హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. పట్టుబడిన వారిని వెంకటేశ్వర్లు, నారాయణరెడ్డి, మధుబాబుగా గుర్తించారు.
తెలంగాణలో ఏపీ పోలీసులు తిరగడంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రజల సొమ్ముతో తెలంగాణలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని…. అందులో భాగంగానే ఏపీ పోలీసులు వచ్చారన్నారు. ఏపీ పోలీసులు పట్టుబడిన ప్రాంతం కూడా సరిహద్దు ప్రాంతం కాదని… ఉత్తర తెలంగాణలోని ధర్మపురి అని కేటీఆర్ వివరించారు.
ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ఏపీ డీజీపీ తాత్కాలిక కార్యాలయాన్ని స్థావరంగా చేసుకుని తెలంగాణలో కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా వెదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. డబ్బు పంపిణీ కోసం వచ్చిన ఏపీ పోలీసులు రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉంటూ కథ నడుపుతున్నారని మండిపడ్డారు.