మేలు చేసే మునగ
మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. – మునక్కాయలో విటమిన్ ‘సి’ ఎక్కువ మోతాదులో ఉంటుంది. గొంతు బొంగురు పోయినపుడు, జలుబు చేసినపుడు మునక్కాయ తింటే ఉపశమనం లభిస్తుంది. – ఆయుర్వేదం ప్రకారం మునగ వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఫలితంగా ఎముకలు ధృఢంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. – గర్భిణులు […]
Advertisement
మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.
– మునక్కాయలో విటమిన్ ‘సి’ ఎక్కువ మోతాదులో ఉంటుంది. గొంతు బొంగురు పోయినపుడు, జలుబు చేసినపుడు మునక్కాయ తింటే ఉపశమనం లభిస్తుంది.
– ఆయుర్వేదం ప్రకారం మునగ వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఫలితంగా ఎముకలు ధృఢంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
– గర్భిణులు మునక్కాయను ఎక్కువగా తినడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల బాధ తగ్గుతుంది. ప్రసవం తర్వాత వచ్చే చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. తల్లిపాలు వృద్ధి అవుతాయి.
– మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.
– మునక్కాయలో ‘బి’ విటమిన్ కూడా తగిన మోతాదులో ఉంది. శక్తిని అందించే ఫోలేట్లూ, విటమిన్ బి6, థయామిన్, రైబోఫ్లెవిన్ వంటివి మునక్కాయలో పుష్కలంగా ఉన్నాయి.
– మునగలో లభించే పీచు, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్య లేకుండా చేస్తాయి. జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి.
– మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
Advertisement