నిందితుడు శ్రీనివాస్‌కు నాలుగు నెలల్లో రెండు లోన్లు
జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనన్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోకి అతడు కత్తి తీసుకుని వెళ్లాడంటే అది పోలీసుల సహకారం లేకుండా సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటీన్ టీడీపీ నేతది కాదా అని నిలదీశారు. ఘటన జరిగిన కేవలం గంటలోనే డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి దాడి చేసింది వైసీపీ కార్యకర్తేనని…. ఇది చిన్న ఘటన అని ఎలా చెబుతారని మండిపడ్డారు. శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ప్రచారం చేస్తున్నారని… కానీ […]
జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనన్నారు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోకి అతడు కత్తి తీసుకుని వెళ్లాడంటే అది పోలీసుల సహకారం లేకుండా సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. శ్రీనివాస్ పనిచేస్తున్న క్యాంటీన్ టీడీపీ నేతది కాదా అని నిలదీశారు. ఘటన జరిగిన కేవలం గంటలోనే డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి దాడి చేసింది వైసీపీ కార్యకర్తేనని…. ఇది చిన్న ఘటన అని ఎలా చెబుతారని మండిపడ్డారు.
శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని ప్రచారం చేస్తున్నారని… కానీ అతడి సోదరుడు మీడియా ముందే తాము ఆరు నెలలుగా టీడీపీలో ఉన్నామని చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. శ్రీనివాస్‌రావు, జగన్‌తో కలిసి ఉన్నారంటున్న ఫ్లెక్సీ ని పచ్చరంగుతో తయారు చేశారన్నారు. కానీ ఇప్పటి వరకు టీడీపీ రంగు అయిన ఎల్లో కలర్‌తో వైసీపీ వారు ఎక్కడా కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయరన్నారు. జనవరి నెలలో తయారు చేసిన ప్లెక్సీపై గద్ద (ఆపరేషన్ గరుడ) ఫొటో ఎలా ముద్రించారని నిలదీశారు.
ఇదంతా ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబు నడిపిస్తున్న డ్రామా అని మండిపడ్డారు. ఆరు నెలలుగా శ్రీనివాసరావు కుటుంబం టీడీపీలో ఉందని… గడిచిన నాలుగు నెలల్లో టీడీపీ ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబానికి రెండు ఇంటి లోన్లను మంజూరు చేసిందన్నారు. ఇప్పటికే ఒక ఇల్లు కూడా నిర్మించారన్నారు. దీన్ని బట్టి శ్రీనివాసరావును మభ్యపెట్టి తిప్పుకుని జగన్ హత్యకు ఉసిగొల్పారన్నది స్పష్టంగా అర్ధమవుతోందన్నారు.
నిందితుడి వద్ద దొరికిందని చెబుతున్న 11 పేజీల లేఖలో ముగ్గురి చేతి రాతలు ఉన్నాయని చెప్పారు. కానీ ఘటన జరిగిన వెంటనే లేఖను బయటపెట్టకుండా రాత్రి 10గంటల వరకు ఎందుకు దాచారని ప్రశ్నించారు. ముగ్గురు వ్యక్తులతో ప్రభుత్వమే ఆ లేఖ రాయించిందని.. ఆ లేఖకు మడతలు లేవన్నారు. కానీ లేఖ నిందితుడి జేబులో దొరికితే మడతలు లేకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. దీన్ని బట్టే ఆ లేఖ ప్రభుత్వమే సృష్టించిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
జగన్‌పై దాడి కేసులో ఏ వన్ ముద్దాయి చంద్రబాబు అని.. ఏ 2 ముద్దాయి డీజీపీ అని సుబ్బారెడ్డి ఆరోపించారు. గతంలో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగినప్పుడు నాటి ప్రతిపక్ష నేత వైఎస్ హత్యాప్రయత్నానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగి నిరసన తెలిపారన్నారు. కానీ జగన్‌పై దాడి తర్వాత చంద్రబాబు దిగజారిమాట్లాడుతున్న తీరుచూస్తుంటే సిగ్గేస్తోందన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్రపతిని, కేంద్ర హోంశాఖను కలుస్తామన్నారు. దాడితో పాటు… ఆపరేషన్ గరుడ పైనా విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.