ఆఖరి మూడువన్డేలకు భారతజట్టులో భువీ, బుమ్రా

షమీకి రెస్ట్, ఉమేశ్ యాదవ్ కొనసాగింపు 27న పూణేలో మూడో వన్డే విండీస్ తో జరిగే ఆఖరి మూడువన్డేల్లో పాల్గొనే భారతజట్టులో పేస్ బౌలర్ల జోడీ భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా చోటు సంపాదించారు. అయితే …మొదటి రెండువన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన..మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి….ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ను జట్టులో కొనసాగించాలని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం నిర్ణయించింది. సిరీస్ లోని మూడో వన్డే ఈనెల 27న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం […]

Advertisement
Update:2018-10-26 02:20 IST
  • షమీకి రెస్ట్, ఉమేశ్ యాదవ్ కొనసాగింపు
  • 27న పూణేలో మూడో వన్డే

విండీస్ తో జరిగే ఆఖరి మూడువన్డేల్లో పాల్గొనే భారతజట్టులో పేస్ బౌలర్ల జోడీ భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా చోటు సంపాదించారు. అయితే …మొదటి రెండువన్డేల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన..మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి….ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ను జట్టులో కొనసాగించాలని ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం నిర్ణయించింది.

సిరీస్ లోని మూడో వన్డే ఈనెల 27న పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో ప్రారంభమవుతుంది. నాలుగో వన్డే ముంబై బ్రబోర్న్ స్టేడియంలో ఈనెల 29న, ఆఖరి వన్డే కొచ్చీ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో నవంబర్ 1న నిర్వహిస్తారు.

విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషభ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఉమేశ్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, కెఎల్ రాహుల్, మనీష్ పాండే.

ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ లోని తొలివన్డేలో టీమిండియా విజయం సాధించడం ద్వారా బోణీ కొడితే….విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News