పరామర్శించడం కూడా తప్పేనా బాబు?
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. చంద్రబాబు నాయుడుకు చేతనయ్యేది కేవలం నీచ రాజకీయం మాత్రమే తప్ప మరోటి కాదని మరోసారి ఈ ఉదంతంతో స్పష్టం అవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రత్యేకించి జగన్ మీద దాడి జరిగిన తర్వాత ప్రముఖులు స్పందించడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టటం పరమ నీఛంగా ఉందన్నారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే […]
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. చంద్రబాబు నాయుడుకు చేతనయ్యేది కేవలం నీచ రాజకీయం మాత్రమే తప్ప మరోటి కాదని మరోసారి ఈ ఉదంతంతో స్పష్టం అవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు.
ప్రత్యేకించి జగన్ మీద దాడి జరిగిన తర్వాత ప్రముఖులు స్పందించడాన్ని చంద్రబాబు నాయుడు తప్పు పట్టటం పరమ నీఛంగా ఉందన్నారు.
జగన్ పై దాడి జరిగిన వెంటనే జరిగిన ఘటనను పలువురు ఖండించారు. వారిలో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు ఉన్నారు. మానవతా ధోరణితోనే వారు ఖండించారని చెప్పాలి. అయితే చంద్రబాబు మాత్రం ఇందులోనూ రాజకీయమే చూస్తున్నాడు.
జగన్ మీద దాడి జరగగానే వాళ్లంతా ఎందుకు స్పందించారు? ఎలా స్పందించారు? అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు.
ఇలా వాళ్లంతా ఒక్కటై తన మీద కుట్ర చేస్తున్నారని బాబు కామెంట్లు చేశాడు. ఇవి ఎంత నీచమైనవో చెప్పనక్కర్లేదు. మానవతా ధోరణితో వాళ్లు స్పందిస్తే అందులో కూడా రాజకీయాన్నే వెదికాడు చంద్రబాబు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. ప్రతిదీ తన రాజకీయానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూడటమే కానీ.. ఈయనకు మానవత్వం అనేది ఏమీ లేదని స్పష్టం అవుతోందని అంటున్నారు విమర్శకులు.
అలిపిరిలో చంద్రబాబు మీద అటాక్ జరిగితే.. ఆయనను పరామర్శించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముందున్నాడు. అయితే పరామర్శించడానికి వచ్చిన వైఎస్ ను ఉద్దేశించి కూడా లేకి మాటలే మాట్లాడాడట చంద్రబాబు. బతికున్నానో లేదో చూసి పోవడానికి వచ్చారా అన్నాడట. అలాంటి మనస్తత్వం చంద్రబాబుది. మరి అలాంటి వ్యక్తి నుంచి ఇప్పుడు జగన్ మీద జరిగిన దాడి విషయంలో నీచ స్పందనను గాక మరోదాన్ని ఎలా ఎక్స్ పెక్ట్ చేస్తారు? అంటున్నారు ప్రతిపక్ష నేతలు.