ఇప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎందుకమ్మా?

విడాకులు తీసుకుని చాలా కాలమే అయినప్పటికీ మరో జీవిత భాగస్వామిని వెతుక్కుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినప్పటికీ మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ కు మాత్రం గతం తాలూకు జ్ఞాపకాలు వదలడం ఇష్టం లేనట్టుగా ఉంది. ఆ మధ్య తన రెండో పెళ్లి గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్లు, వ్యతిరేక కామెంట్లు అన్నింటి మీద నిరసన ప్రకటించి బ్రేక్ అప్ కు కారణాలు కూడా చాలా స్పష్టంగా చెప్పిన రేణు దేశాయ్ తాజాగా జానీ […]

Advertisement
Update:2018-10-25 10:30 IST

విడాకులు తీసుకుని చాలా కాలమే అయినప్పటికీ మరో జీవిత భాగస్వామిని వెతుక్కుని దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినప్పటికీ మాజీ హీరోయిన్ రేణు దేశాయ్ కు మాత్రం గతం తాలూకు జ్ఞాపకాలు వదలడం ఇష్టం లేనట్టుగా ఉంది.

ఆ మధ్య తన రెండో పెళ్లి గురించి పవన్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రియాక్షన్లు, వ్యతిరేక కామెంట్లు అన్నింటి మీద నిరసన ప్రకటించి బ్రేక్ అప్ కు కారణాలు కూడా చాలా స్పష్టంగా చెప్పిన రేణు దేశాయ్ తాజాగా జానీ షూటింగ్ టైంలో తీసుకున్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి ఏదో చెప్పాలనే ప్రయత్నం అయితే చేసింది.

జానీ షూటింగ్ ప్రారంభంలో తాను కేవలం ప్రొడక్షన్ డిజైనర్ గా మాత్రమే ఉన్నానని యాక్టింగ్ అంటే ఆసక్తి లేక కేవలం టెక్నికల్ డిపార్ట్‌మెంట్ కే పరిమితం కావాలని నిర్ణయించుకుంటే పవన్ బలవంతం మీద హీరోయిన్ గా కూడా నటించాల్సి వచ్చిందని దీని వల్ల జానీ పూర్తయ్యే వరకు రోజూ 18 గంటలు పని చేయాల్సి వచ్చిందని అందులో సవివిరంగా రాసింది.

తాను మానసికంగా ఎంత బలపడ్డానో జానీ షూటింగ్ లోనే తెలిసింది అని నొక్కి చెప్పిన రేణు దేశాయ్ తన మానసిక బలానికి పవన్ కళ్యాణ్ కారణం అనేలా చెప్పడంతో మరోసారి ఇది టాపిక్ గా మారే ఆవకాశం కనిపిస్తోంది. అయినా పవన్ తాలూకు జ్ఞాపకాలు, అభిమానుల కామెంట్లు వద్దు అనుకున్నప్పుడు ఇలాంటివి పోస్ట్ చేయకపోతేనే మంచిది. లేకపోతే చూసావా మా అన్నయ్యను నువ్వు ఇంకా మర్చిపోలేదు అంటూ కొందరు అభిమానులు వింత అర్థాలు తీసే ప్రమాదం ఉంది.

సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన రేణు దేశాయ్ మళ్ళీ పవన్ దర్శకత్వం వహించి తాము కలిసి నటించిన సినిమా గురించే ప్రత్యేకంగా చెప్పడం చూస్తే కావాలని ప్లాన్ చేసినట్టుగా అనిపించడం సహజం. ఆమె ఈ పోస్ట్ కు పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News