జగన్‌ పై మంత్రి కాలువ ఎదురుదాడి

దాడి జరిగిన వెంటనే చికిత్స చేయించుకోకుండా జగన్‌ ఎందుకు హడావుడిగా హైదరాబాద్‌ వెళ్లారని మంత్రి కాలువ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. కత్తికి విషం పూసి ఉంటారన్న అనుమానం ఉన్నప్పుడు వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని నిలదీశారు. ఇదో చిన్న ఘటన అయినప్పటికీ రాష్ట్రంలో ఇంతగా ఎందుకు రచ్చ చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. ఘటన జరిగిన గంటలోనే గవర్నర్‌ స్పందించి డీజీపీకి ఫోన్ చేయడం, కేసీఆర్, కేటీఆర్‌లు వెంటనే స్పందించడం ఏమిటని నిలదీశారు. అంత పెద్ద […]

Advertisement
Update:2018-10-25 11:30 IST

దాడి జరిగిన వెంటనే చికిత్స చేయించుకోకుండా జగన్‌ ఎందుకు హడావుడిగా హైదరాబాద్‌ వెళ్లారని మంత్రి కాలువ శ్రీనివాస్‌ ప్రశ్నించారు. కత్తికి విషం పూసి ఉంటారన్న అనుమానం ఉన్నప్పుడు వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్లకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని నిలదీశారు.

ఇదో చిన్న ఘటన అయినప్పటికీ రాష్ట్రంలో ఇంతగా ఎందుకు రచ్చ చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. ఘటన జరిగిన గంటలోనే గవర్నర్‌ స్పందించి డీజీపీకి ఫోన్ చేయడం, కేసీఆర్, కేటీఆర్‌లు వెంటనే స్పందించడం ఏమిటని నిలదీశారు. అంత పెద్ద దాడి జరిగి ఉంటే ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎందుకు ఆస్పత్రికి తీసుకెళ్లలేదని నిలదీశారు. జగన్‌పై దాడి వెనుక కుట్ర ఉందని తమకూ అనుమానాలు ఉన్నాయన్నారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌పై జరుగుతున్న కుట్ర అని కాలువ అభివర్ణించారు. ఆపరేషన్ గురుడలో చెప్పినవన్నీ ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు పై స్థాయిలో ఏదో కుట్ర జరుగుతోందన్నారు. వైసీపీ నేతలు జిల్లాల్లో ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌తో పాటు ప్రతి ఒక్కరినీ రక్షించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని కాలువ చెప్పారు.

శాంతిభద్రతలే ఈ రాష్ట్రంలో లేకపోతే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జగన్‌ సామాన్యుల మధ్య పాదయాత్ర చేసేవారా అని కాలువ శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ దాడిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News