టాయిలెట్ల కన్నా ఏటీఎం'లే యమ డేంజర్!
ఏటీఎంలతో ఏం డేంజరుంది..? అసలు టాయిలెట్లతో వాటికి పోలికేమిటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి… ఏటీఎంలు ఇపుడు టాయిలెట్లకన్నా హీనంగా మారిపోతున్నాయంట. టాయిలెట్లంటే మనం ఇంట్లో వాడే టాయిలెట్లనుకునేరు. వాటిని మనం ఎలాగూ శుభ్రంగానే ఉంచుకుంటాం. అవి కాదు. పబ్లిక్ టాయిలెట్లంట. పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు. ఏటీఎంలు చూడ్డానికి పరిశుభ్రంగానే ఉన్నట్లు పైకి కనిపిస్తాయి. పబ్లిక్ టాయిలెట్లలో లాగా అక్కడ దుర్గంధమేమీ ఉండదు. పైగా లోపలికి వెళ్ళగానే ఏసీ చల్లదనం మనకు […]
Advertisement
ఏటీఎంలతో ఏం డేంజరుంది..? అసలు టాయిలెట్లతో వాటికి పోలికేమిటి అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి… ఏటీఎంలు ఇపుడు టాయిలెట్లకన్నా హీనంగా మారిపోతున్నాయంట. టాయిలెట్లంటే మనం ఇంట్లో వాడే టాయిలెట్లనుకునేరు. వాటిని మనం ఎలాగూ శుభ్రంగానే ఉంచుకుంటాం. అవి కాదు. పబ్లిక్ టాయిలెట్లంట. పబ్లిక్ టాయిలెట్లు ఎంత ఘోరంగా ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు. ఏటీఎంలు చూడ్డానికి పరిశుభ్రంగానే ఉన్నట్లు పైకి కనిపిస్తాయి. పబ్లిక్ టాయిలెట్లలో లాగా అక్కడ దుర్గంధమేమీ ఉండదు. పైగా లోపలికి వెళ్ళగానే ఏసీ చల్లదనం మనకు హమ్మయ్య అనిపిస్తుంటుంది. కానీ ఏటీఎం సెంటర్లలో ని మిషన్లపై నే అసలు కథంతా ఉంది. ఆ మిషన్ల కు ఉండే టచ్ ప్యాడ్లలోనే భయంకరమైన బ్యాక్టీరియాలు నివశిస్తున్నాయి. టచ్ చేస్తే అంతే మనలను అంటుకుని అంటు రోగాల బారిన పడేస్తాయి. పబ్లిక్ టాయిలెట్లలో ఉండే ఘోరమైన బ్యాక్టీరియాలే ఇక్కడా ఉంటున్నాయి. బ్రిటన్ లో ఇటీవల జరిపిన పరిశోధనలలో ఈ విషయాలు బైటపడ్డాయి. సూడొమొనాడ్స్, బాసిల్లస్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఏటీఎంలలో కనిపించాయి. అనునిత్యం వందలాదిమంది ఉపయోగిస్తుండడంతో ఇవి ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపిస్తున్నాయి. డయేరియా తో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు ఇవి కారణమవుతాయి. తస్మాత్ జాగ్రత్త…
Advertisement