వన్డే క్రికెట్లో విరాట్ కొహ్లీ 36వ శతకం
107 బాల్స్ లో 21 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 140 పరుగులు గౌహతీ వన్డేలో రోహిత్ తో కలసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం కెరియర్ లో 36 వన్డే, 24 టెస్ట్ శతకాల విరాట్ కొహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు. విండీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో భాగంగా… గౌహతీ బారస్పారా స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో చెలరేగిపోయాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి రెండో […]
- 107 బాల్స్ లో 21 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 140 పరుగులు
- గౌహతీ వన్డేలో రోహిత్ తో కలసి డబుల్ సెంచరీ భాగస్వామ్యం
- కెరియర్ లో 36 వన్డే, 24 టెస్ట్ శతకాల విరాట్ కొహ్లీ
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నాడు.
విండీస్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో భాగంగా… గౌహతీ బారస్పారా స్టేడియం వేదికగా ముగిసిన తొలివన్డేలో చెలరేగిపోయాడు.
ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి రెండో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. కొహ్లీ 107 బాల్స్ ఎదుర్కొని 21 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 140 పరుగుల స్కోరు సాధించాడు.
29 ఏళ్ల కొహ్లీ కెరియర్ లో ఇది 36వ వన్డే సెంచరీ కాగా… ఓవరాల్ గా 60వ శతకం కావడం విశేషం.
అంతేకాదు.. వరుసగా 20 మ్యాచ్ ల్లో చేజింగ్ శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ కొహ్లీ మాత్రమే. గౌహతీ వన్డే వరకూ 212 మ్యాచ్ లు ఆడిన కొహ్లీ 36 శతకాలు, 48 హాఫ్ సెంచరీలతో 9 వేల 919 పరుగులు సాధించాడు.