ఆపరేషన్ కొడంగల్‌కు గులాబీ సైన్యం
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్లాన్‌లు గీస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో కీలక నేతలకు వల వేసింది. వారు పార్టీ మారారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది. మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్ పోటీకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. ఆపరేషన్ కొడంగల్‌ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ విజయం సాధించాలంటే పక్కాగా ముందుకు వెళ్లాలని […]
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది. కొడంగల్‌లో రేవంత్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్లాన్‌లు గీస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో కీలక నేతలకు వల వేసింది. వారు పార్టీ మారారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చింది. మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్ పోటీకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది.
ఆపరేషన్ కొడంగల్‌ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ విజయం సాధించాలంటే పక్కాగా ముందుకు వెళ్లాలని గులాబీ దళం యోచిస్తోంది. ఇందులో భాగంగా కొడంగల్ కోసం ఓ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే తెలంగాణ భవన్‌లో దసరా రెండు రోజుల ముందు తెలంగాణ విద్యార్థి విభాగంతో పాటు ఇతర విభాగాలతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించింది. దాదాపు 150 మంది కార్యకర్తలకు కొడంగల్ బాధ్యతలు అప్పగించింది.
ఎన్నికలు ముగిసేదాకా కొడంగల్‌లో మకాం వేసి… ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు రిపోర్టు పంపించాలి. ఈ సమావేశంలో పాల్గొన్నవారికి ఓ బుక్‌లెట్ అందించింది. అందులో కొన్ని ప్రశ్నలతో పాటు…. వైట్ పేపర్లను పెట్టారు. ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడంతో పాటు తమ పర్యటనలో వారు గుర్తించిన విషయాలను పార్టీకి చేరవేయాలని సూచించారు.
కొడంగల్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. కొడంగల్, కోస్గి, బొంరాస్‌పేట్, దౌలతాబాద్, మద్దురూ. ఈ ఐదు మండలాలకు 20 నుంచి 25 మంది ఓ టీమ్‌గా ఏర్పాటు చేశారు. వీరు గ్రామాల్లో తిరగాలి. ఆ గ్రామంలో ముఖ్య నేతలు ఎవరు? కాంగ్రెస్ లో కీలక నేతలు ఎవరు? వారికి రేవంత్‌తో అటాచ్‌మెంట్ ఏంటి? టీఆర్ఎస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? గ‌్రామంలో ఏ సామాజికవర్గం ఓట్లు ఎన్ని? పరపతి ఉన్న నాయకులు ఎవరు? తటస్తులు టీఆర్ఎస్ వైపు రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలతో బుక్‌లెట్ తయారు చేశారు. ఈ 15 రోజుల్లో ఈ వివరాలు సేకరించి కొడంగల్ వ్యూహాన్ని గులాబీ నేతలు రచించబోతున్నారు.
ఈ కార్యకర్తల గ్రూపులకు అన్ని విధాలుగా ఖర్చును భరించే విధంగా కొంతమంది టీఆర్ఎస్ నేతలకు అప్పజెప్పారు. ఆ నేతలు డైరెక్షన్‌లో వీరు పనిచేయబోతున్నారు.