రాంగ్ రూట్లో దగ్గుబాటి సురేష్ కారు బీభత్సం
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్‌లో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చింది. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు బైకుపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వారు 50 అడుగుల మేర ఎగిరిపడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. బైకుపై ఉన్న మూడేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరగగానే కారును […]
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్‌లో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చింది. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు బైకుపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టింది. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బైకుపై వెళ్తున్న వారు 50 అడుగుల మేర ఎగిరిపడ్డారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి ఎమర్జెన్సీ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
బైకుపై ఉన్న మూడేళ్ల బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరగగానే కారును వదిలేసి అందులోని వారు పారిపోయారు. ఈ ప్రమాదం విషయంలో 41ఏ కింద కార్ఖానా పోలీసులు సురేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ప్రమాద సమయంలో కారులో దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నారా లేదా అన్నది పోలీసులు నిర్ధారించడం లేదు.