రజనీకాంత్ పాలిటిక్స్... అదే తర్జనభర్జన!

రాజకీయం విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్జనభర్జనలు ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టుగా లేవు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 12లు వస్తున్నాయి, పోతున్నాయి కానీ… రజనీకాంత్ పొలిటికల్ పార్టీ ఏర్పాటు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జయలలిత మరణించినప్పటి నుంచి రజనీకి పొలిటికల్ డ్రీమ్స్ పతాకస్థాయికి చేరాయి. అయితే అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో రజనీకాంత్ కే క్లారిటీ ఉందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే పార్టీ […]

Advertisement
Update:2018-10-21 08:50 IST

రాజకీయం విషయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్జనభర్జనలు ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టుగా లేవు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 12లు వస్తున్నాయి, పోతున్నాయి కానీ… రజనీకాంత్ పొలిటికల్ పార్టీ ఏర్పాటు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

జయలలిత మరణించినప్పటి నుంచి రజనీకి పొలిటికల్ డ్రీమ్స్ పతాకస్థాయికి చేరాయి. అయితే అవి ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో రజనీకాంత్ కే క్లారిటీ ఉందో లేదో తెలియని పరిస్థితి.

ఇప్పటికే పార్టీ ఏర్పాటు అయినట్టే అని అప్పుడెప్పుడో అనుకున్నారు. ఆధ్యాత్మిక రాజకీయం అని, రుద్రాక్ష గుర్తు అని, బాబా సింబల్.. అని అప్పట్లో హడావుడి సాగింది. అయితే పార్టీ ఏర్పాటు మాత్రం ఇంకా జరగలేదు.

ఇక తాజాగా సూపర్ స్టార్ మాట్లాడుతూ పార్టీ ఏర్పాటు పనులు 90 శాతం పూర్తి అయినట్టే అని అంటున్నాడు. అయితే ఇదే సమయంలో చెప్పిన మరో మాట.. డిసెంబర్ 12న పార్టీ ఏర్పాటు గురించి ఇంకా క్లారిటీ లేదు అని!

డిసెంబర్‌ లో తిరుచ్చిరాపల్లిలో పార్టీ కార్యక్రమం జరుగుతుందని రజనీకాంత్ అంటున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట.

అయితే లోక్ సభ… సార్వత్రిక ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయం డిసెంబర్ తో కొలిక్కి వస్తుందా ? రాదా ? అనేది ఇంకా సందేహంగానే ఉంది.

డిసెంబర్‌లో జరిగే పార్టీ కార్యక్రమంతో గనుక రజనీకాంత్ రాజకీయ పార్టీ ఒక కొలిక్కి వస్తే తమిళనాట రాజకీయాలు మరింత రసకందాయకంగా మారతాయి. అలా కాకపోతే రజనీకాంత్ రాజకీయం కొశ్చన్ మార్కే!

Tags:    
Advertisement

Similar News