ఏపీలో దోచి..తెలంగాణలో పంచుతున్న టీడీపీ!

తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తును ఏర్పరుచుకోవడానికి ప్రధాన కారణం డబ్బే అనేమాట తొలి నుంచి వినిపిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి మూడు నాలుగు కోట్ల రూపాయల చొప్పున.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు అందించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడని.. ఫలితంగానే ఈ పొత్తు కుదిరిందనే వార్తలు మొదట్లోనే వచ్చాయి. లేకపోతే తెలంగాణలో శూన్యం అయిపోయిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని అంతా అనుకున్నారు. అందుకు […]

Advertisement
Update:2018-10-20 05:11 IST

తెలుగుదేశం పార్టీతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొత్తును ఏర్పరుచుకోవడానికి ప్రధాన కారణం డబ్బే అనేమాట తొలి నుంచి వినిపిస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి మూడు నాలుగు కోట్ల రూపాయల చొప్పున.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు అందించడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడని.. ఫలితంగానే ఈ పొత్తు కుదిరిందనే వార్తలు మొదట్లోనే వచ్చాయి.

లేకపోతే తెలంగాణలో శూన్యం అయిపోయిన తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే ఛాన్సే లేదని అంతా అనుకున్నారు.

అందుకు తగ్గట్టుగా ఇప్పుడు కదలికలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తమ్ముళ్లు డబ్బులతో దొరకడం ప్రారంభం అయ్యింది. ఒక చోటామోటా నేతే అరవై లక్షల రూపాయల డబ్బుతో పట్టుబడ్డాడు. ఇతడి స్థాయి చాలా చిన్నది. కానీ.. ఇతడే అరవై లక్షల రూపాయలతో పట్టుబడటం విశేషం. అందునా.. ఇది టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రమణ నియోజకవర్గం జగిత్యాలకు తరలుతూ పట్టుబడటం విశేషం.

ఇంకా ఎన్నికల ప్రక్రియలో డబ్బులు పంచడానికి చాలా సమయం ఉంది. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇలా డబ్బులతో పట్టుబడుతూ ఉండటం విశేషం. అందునా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ నేతలు ఇలాంటి డబ్బుల పంపకాల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని స్పష్టం అవుతోంది.

తెలుగుదేశం పార్టీ తీరును చూస్తుంటే ఏపీలో దోచింది తెలంగాణలో పంచుతున్నట్టుగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత నాలుగున్నరేళ్ల వ్యవధిలో ఏపీలో తెలుగుదేశం పార్టీ పాలనపై ఉన్న అవినీతి మరకలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు రావడం, అక్కడ టీడీపీ డబ్బులతో పట్టుబడుతూ ఉండటంతో.. దోచిన డబ్బును ఇలా ఉపయోగించుకుంటున్నారు టీడీపీ నేతలు అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనిపై టీడీపీ ఏమంటుందో!

Tags:    
Advertisement

Similar News