ఏబీఎన్ రాధాకృష్ణపైనా ఐటీ దాడులు?
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసే నడుస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే ప్రత్యర్థులు మీడియాను కూడా అదే తరహాలో చూస్తున్నారు. ఏపీలో ఇటీవల సుజనా చౌదరి, సీఎం రమేష్‌పై ఐటీ దాడులు జరిగాయి. వారితో పాటు టీడీపీ కోసం పనిచేస్తున్న అనుబంధ సంస్థలపైనా దాడులు జరగబోతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ చానల్ లో సీఎంరమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుతో ఆ చానల్ ఎండీ రాధాకృష్ణ చర్చ నిర్వహించారు. […]
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు కలిసే నడుస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలను టార్గెట్ చేసే ప్రత్యర్థులు మీడియాను కూడా అదే తరహాలో చూస్తున్నారు. ఏపీలో ఇటీవల సుజనా చౌదరి, సీఎం రమేష్‌పై ఐటీ దాడులు జరిగాయి.
వారితో పాటు టీడీపీ కోసం పనిచేస్తున్న అనుబంధ సంస్థలపైనా దాడులు జరగబోతాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏబీఎన్ చానల్ లో సీఎంరమేష్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావుతో ఆ చానల్ ఎండీ రాధాకృష్ణ చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ తనపైనే కాకుండా ఆంధ్రజ్యోతిపైనా ఐటీ దాడులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని పలువురు బీజేపీ నేతలే చెప్పారని వెల్లడించారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పని చూస్తామంటున్నారని సీఎం రమేష్ వివరించారు. దీంతో నిజమేనా తమపైనా ఐటీ దాడులు చేయిస్తారా అని జీవీఎల్‌ను రాధాకృష్ణ ప్రశ్నించారు. ఒకవేళ అలా చేసినా తమకేమీ అభ్యంతరం లేదని… ఐటీతో పాటు మీరు కూడా రండి అని జీవీఎల్‌ను కోరారు.
ఇందుకు స్పందించిన జీవీఎల్ … ”మీలాగే అందరూ ధైర్యంగా ఉండాలి. ఎవరొచ్చినా ఆహ్వానించాలి. తప్పు చేయనప్పుడు ఎవరూ ఇబ్బందిపడాల్సిన, భయపడాల్సిన పని లేదు” అన్నారు. అసలు ఆంధ్రజ్యోతిపైనా బీజేపీ నేతలు ఎందుకు ఐటీ దాడులు చేయించాలనుకుంటున్నారు?. ఐటీ దాడులు చేసినా తనకేమీ ఇబ్బంది లేదని రాధాకృష్ణ చెప్పినప్పుడు అదే మాటను సీఎం రమేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు?. తాము తప్పు చేయలేదు.. కాబట్టి ఐటీని కాకుంటే సీబీఐని పంపించండి అని సీఎం రమేష్ ఎందుకు చాలెంజ్ చేయలేకపోతున్నారు? అన్నది ప్రశ్న.