ప్రపంచ క్రికెట్లో అసాధారణ రికార్డు

మూడుతరాల క్రికెటర్ల డబుల్ సెంచరీలు తాత 337, తండ్రి 208…కొడుకు 265 పాక్ క్రికెట్లో అరుదైన ఘట్టం మూడు శతాబ్దాల క్రికెట్ రికార్డుల్లో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. ఇప్పటి వరకూ…. ఒకటి లేదా రెండు తరాల క్రికెటర్లు మాత్రమే డబుల్ సెంచరీలు సాధించిన రికార్డులు ఉన్నాయి.అయితే…పాకిస్థాన్ క్రికెట్లో మాత్రం…మూడు తరాలకు చెందిన తాత… తండ్రి… కొడుకు…ద్విశతకాలు బాది చరిత్ర సృష్టించారు. 1950 దశకంలో హనీఫ్… పాకిస్థాన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన హనీఫ్ […]

Advertisement
Update:2018-10-18 07:29 IST
  • మూడుతరాల క్రికెటర్ల డబుల్ సెంచరీలు
  • తాత 337, తండ్రి 208…కొడుకు 265
  • పాక్ క్రికెట్లో అరుదైన ఘట్టం

మూడు శతాబ్దాల క్రికెట్ రికార్డుల్లో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. ఇప్పటి వరకూ…. ఒకటి లేదా రెండు తరాల క్రికెటర్లు మాత్రమే డబుల్ సెంచరీలు సాధించిన రికార్డులు ఉన్నాయి.అయితే…పాకిస్థాన్ క్రికెట్లో మాత్రం…మూడు తరాలకు చెందిన తాత… తండ్రి… కొడుకు…ద్విశతకాలు బాది చరిత్ర సృష్టించారు.

1950 దశకంలో హనీఫ్…
పాకిస్థాన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన హనీఫ్ అహ్మద్ 1957-58 సీజన్లో… వెస్టిండీస్ ప్రత్యర్థిగా 337 పరుగులు సాధించారు. అంతేకాదు..తన కెరియర్ లో 55 టెస్టులు ఆడిన హనీఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఓ మ్యాచ్ లో 970 నిముషాలపాటు క్రీజులోనే ఉండి..499 పరుగులు సాధించారు. 16 గంటల 10 నిముషాలపాటు క్రీజులో నిలిచిన రికార్డు 1950 దశకంలో
కేవలం హనీఫ్ మహ్మద్ కు మాత్రమే సొంతం.

1980 దశకంలో
అంతేకాదు…హనీఫ్ కుమారుడు, పాక్ మాజీ టెస్ట్ ప్లేయర్ షోయబ్ మహ్మద్ సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 208 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. షోయబ్ కు సైతం 45 టెస్టులు, 63 వన్డేలు ఆడిన రికార్డు ఉంది.

20వ దశకంలో…..
ఈ రికార్డుల పరంపర హనీఫ్, షోయబ్ లతోనే ఆగిపోలేదు. షోయబ్ మహ్మద్ కుమారుడు షెజార్ అహ్మద్ సైతం ..పాక్ దేశవాళీ క్రికెట్లో డబుల్ సెంచరీ బాదడం ద్వారా…సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ క్రికెట్ స్టేడియం వేదికగా ముల్తాన్ జట్టుతో ముగిసిన మ్యాచ్ లో కరాచీ వైట్స్ జట్టు తరపున షెజార్ అహ్మద్ 265 పరుగుల స్కోరు సాధించాడు. మొత్తం 464 బాల్స్ ఎదుర్కొని 30 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో ద్విశతకం సాధించాడు.

ద్విశతకాల ఫ్యామిలీ….
హనీఫ్ మహ్మద్ సోదరులు సాదిక్, ముస్తాక్ అహ్మద్ లకు సైతం… ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధించిన రికార్డు ఉంది. అంటే …ఒకే కుటుంబానికి చెందిన మూడుతరాలకు చెందిన ఐదుగురు క్రికెటర్లు డబుల్ సెంచరీలు సాధించడం…క్రికెట్ చరిత్రలో మాత్రమే కాదు…గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో సైతం చేరిపోనుంది.

Tags:    
Advertisement

Similar News