కేసీఆర్ వ‌రాల వెనుక క‌థేంటి?

తెలంగాణ ఎన్నిక‌లకు ఇంకా 45 రోజులకు పైగా టైముంది. కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్ట్ రాలేదు. మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేల‌లేదు. కానీ అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌చారం ప్రారంభించింది. స‌గం మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 1.ఆసరా పింఛన్లు ఒక వెయ్యి నుండి రూ.2016 కు పెంపు 2.వికలాంగుల పింఛన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు 3 రెడ్డి, ఆర్యవైశ్య కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు 4. రైతు బంధు పథకం కింద ఎకరానికి ప్రస్తుతం ఉన్న […]

Advertisement
Update:2018-10-17 00:59 IST

తెలంగాణ ఎన్నిక‌లకు ఇంకా 45 రోజులకు పైగా టైముంది. కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్ట్ రాలేదు. మ‌హాకూట‌మి సీట్ల లెక్క తేల‌లేదు. కానీ అధికార పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌చారం ప్రారంభించింది. స‌గం మేనిఫెస్టో రిలీజ్ చేసింది.

1.ఆసరా పింఛన్లు ఒక వెయ్యి నుండి రూ.2016 కు పెంపు
2.వికలాంగుల పింఛన్ రూ.1500 నుండి రూ.3016 కు పెంపు
3 రెడ్డి, ఆర్యవైశ్య కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు
4. రైతు బంధు పథకం కింద ఎకరానికి ప్రస్తుతం ఉన్న 8 వేల రూపాయల పెట్టుబడిని రూ. 10 వేలకు పెంపు
5. గతంలో మాదిరి గానే రైతులకు లక్ష లోపు రుణాల మాఫీ
6. 57ఏళ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు, సొంత స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
7. రైతు సమన్వయ సమితికి ప్రోత్సాహకం
8. సముచిత రీతిలో ఉద్యోగస్తులకు జీతాలు
9. నిరుద్యోగ భృతి రూ. 3,016

కేసీఆర్ నిన్న చెప్పిన వరాలు ఇవి. కానీ కేసీఆర్ లో ఏదో తేడా కొడుతోంది అని ఈ వ‌రాల ప్ర‌క‌ట‌న చూస్తే తెలుస్తోంది. స‌ర్వేల్లో వ‌స్తున్న రిజ‌ల్ట్ ప్ర‌కార‌మే కేసీఆర్ ఈ వ‌రాలు కురిపించార‌ని అంటున్నారు. కాంగ్రెస్ ఇప్ప‌టివ‌ర‌కూ చెబుతున్న అంశాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

రెండు వేల ఫించ‌న్, రెండు ల‌క్ష‌ల రైతు రుణ‌మాఫీ, 6 గ్యాస్ సిలిండ‌ర్లు ఫ్రీ, నిరుద్యోగ‌భృతి…. ఈ అంశాల‌కు జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. దీంతో అలర్ట్ అయిన గులాబీ బాస్ ముందే వ‌రాలు ప్ర‌క‌టించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఉద్యోగాల‌పై నిరుద్యోగుల్లో నిరాశ ఏర్ప‌డింది. అసంతృప్తి తీవ్రంగా ఉంది. దీన్ని మ‌ళ్లించేందుకే నిరుద్యోగ భృతి ప్ర‌క‌టించార‌ని అంటున్నారు.

మ‌రోవైపు రైతు బంధు చెక్కుల పంపిణీ ఒక విడ‌త జ‌రిగినా…. మ‌రోవిడ‌తకు రంగం సిద్ధ‌మైంది. అయినా ఏదో తేడా…. మ‌ళ్లీ ల‌క్ష రూపాయ‌ల రుణమాఫీ ప్ర‌కటించాల్సిన అవ‌స‌రం వ‌చ్చి ప‌డింది.

మొత్తానికి గులాబీ పెద్దలు ఊహించిన‌ట్లుగా గ్రౌండ్‌ లేవల్ లో పరిస్థితులు సానుకూలంగా లేవన్న సంకేతాలు మాత్రం వ‌స్తున్నాయి. ఇది ఊహించే కేసీఆర్ ఈ వ‌రాల ప్ర‌క‌ట‌న చేశార‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News