టీఆర్ఎస్ కు విద్యార్థి నేతల అల్టిమేటం....

ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు వాళ్లు కావాలి.. బంద్ లు, రాస్తారోకోలకు వారే కావాలి.. ర్యాలీలు, సభలు కావాలంటే వాళ్లే కావాలి.. కానీ అధికారంలో మాత్రం వారికి భాగస్వామ్యం లేదు. ఒకటి రెండు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా? తెలంగాణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అయిన తెలంగాణ విద్యార్థి లోకానికి పార్టీలు ఈసారి ఎన్ని సీట్లు ఇస్తున్నాయని ఆత్మావలోకనం చేసుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టేయవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తెలంగాణ విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ కొన్ని సీట్లు ఇచ్చింది. […]

Advertisement
Update:2018-10-16 06:33 IST

ఉద్యమాన్ని ఉరకలెత్తించేందుకు వాళ్లు కావాలి.. బంద్ లు, రాస్తారోకోలకు వారే కావాలి.. ర్యాలీలు, సభలు కావాలంటే వాళ్లే కావాలి.. కానీ అధికారంలో మాత్రం వారికి భాగస్వామ్యం లేదు. ఒకటి రెండు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడమేనా? తెలంగాణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ అయిన తెలంగాణ విద్యార్థి లోకానికి పార్టీలు ఈసారి ఎన్ని సీట్లు ఇస్తున్నాయని ఆత్మావలోకనం చేసుకుంటే వేళ్ళ మీద లెక్కపెట్టేయవచ్చు.

తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన తెలంగాణ విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ కొన్ని సీట్లు ఇచ్చింది. బాల్క సుమన్, పిడమర్తి రవి, ఎర్రోళ్ల శ్రీనివాస్ లాంటి వాళ్లకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవించింది. ఇక మిగతా పార్టీలు ఇచ్చినా అంతగా అవకాశాలు దక్కించుకోలేదు. 2014 ముగిసింది. ఇప్పుడు 2019 ముగింట నిలబడింది. మరి ఇప్పుడు ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తున్నాయంటే.. వారిని అస్సలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే విద్యార్థి లోకం పోరుబాట పట్టింది.

తాజాగా అసెంబ్లీ బరిలోకి దిగేందుకు కేయూ, ఓయూ విద్యార్థి లోకం నడుం బిగించింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన తాము ప్రజాసేవకు పనికిరామా? అని కేయూ విద్యార్థి జేఏసీ నేతలు టీఆర్ఎస్ ను వరంగల్ లో మీటింగ్ పెట్టి మరీ ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఎందుకు ఇవ్వరని ఓరుగల్లు విద్యార్థులు ప్రశ్నించారు. కేయూ పరిధిలోని నాలుగు సీట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే స్వతంత్రంగా పోటీచేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కేయూలో నిర్వహించిన సమావేశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కేసీఆర్ ఇప్పటికే 105 మంది తాజామాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలకే టికెట్లు ప్రకటించేశారు. ఇప్పుడు ఇయ్యడానికి ఏం లేవు. ఇలాంటి సమయంలో విద్యార్థి నేతలు ఆగ్రహించి టికెట్లు కావాలంటున్నారు. దీంతో గులాబీ పార్టీ ఏం చేస్తుంది. వారి మద్దతు ఎలా కూడగడుతుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News