లోకేష్ పర్యటన రద్దు అందుకేనా?
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన రద్దు అయింది. ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు లోకేష్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ కార్యక్రమంలో పాల్గొన్నాల్సి ఉంది. అయితే లోకేష్ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. తిత్‌లీ తుపాను వల్లే లోకేష్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రకటించారు. ప్రస్తుతం లోకేష్ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. అక్కడి బాధితులతో మాట్లాడి వారికి అవసరమైన సాయం చేస్తున్నారు. తుపాను వల్ల భారీగా […]
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన రద్దు అయింది. ఈనెల 17 నుంచి మూడు రోజుల పాటు లోకేష్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. వరల్డ్ ఫుడ్ ఫ్రైజ్ కార్యక్రమంలో పాల్గొన్నాల్సి ఉంది.
అయితే లోకేష్ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు. తిత్‌లీ తుపాను వల్లే లోకేష్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని ప్రకటించారు. ప్రస్తుతం లోకేష్ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు.
అక్కడి బాధితులతో మాట్లాడి వారికి అవసరమైన సాయం చేస్తున్నారు. తుపాను వల్ల భారీగా నష్టం కలగడం, ఇంకా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మరో మూడు రోజుల పాటు అక్కడే ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కారణాల వల్ల తుపాను బాధితులను ఎక్కువగా కలుసుకోలేకపోతున్నారు. దీంతో నారా లోకేష్ చురుగ్గా బాధిత గ్రామాల్లో పర్యటిస్తున్నారు.