జనసేనలోకి కాపు జేఏసీ.... పవన్‌కు ప్లస్సా? మైనస్సా?
అటు తిరిగి ఇటు తిరిగి ముద్రగడ పద్మనాభం చివరకు జనసేన వైపే వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ముద్రగడ అనేక రకాలుగా స్పందించాడు. అందులో కొంత సమయం చంద్రబాబును ప్రశంసించాడు. దీంతో ఈయన తెలుగుదేశంలో చేరతాడనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయకత్వంలోనే తాము రిజర్వేషన్లను సాధించుకుంటామన్నట్టుగా ముద్రగడ మాట్లాడటం సంచలనం రేపింది. ఒకవైపు కాపులకు ద్రోహం చేసింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకొమ్మని అడిగిన తనను తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసింది చంద్రబాబు నాయుడే అని ముద్రగడ […]
అటు తిరిగి ఇటు తిరిగి ముద్రగడ పద్మనాభం చివరకు జనసేన వైపే వెళ్తున్నాడని ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ముద్రగడ అనేక రకాలుగా స్పందించాడు. అందులో కొంత సమయం చంద్రబాబును ప్రశంసించాడు. దీంతో ఈయన తెలుగుదేశంలో చేరతాడనే వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయకత్వంలోనే తాము రిజర్వేషన్లను సాధించుకుంటామన్నట్టుగా ముద్రగడ మాట్లాడటం సంచలనం రేపింది.
ఒకవైపు కాపులకు ద్రోహం చేసింది, ఇచ్చిన హామీని నిలబెట్టుకొమ్మని అడిగిన తనను తీవ్రంగా ఇబ్బందుల పాల్జేసింది చంద్రబాబు నాయుడే అని ముద్రగడ అనేక సార్లు ఆరోపించాడు.
ఆ తర్వాతేమో బాబు ద్వారానే రిజర్వేషన్లను సాధించుకుంటామని ప్రకటించాడు. ఇలా ద్వంద్వ వైఖరిని చాటుకున్నాడీయన.
ఇలాంటి నేపథ్యంలో ఈయన తీరు ప్రశ్నార్థకం అయ్యింది. ఆ సమయంలో కాపు రిజర్వేషన్లకు అనుకూలమని పవన్ కల్యాణ్ ప్రకటించినా.. ముద్రగడ పట్టించుకోలేదు.
ఆ సంగతలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశంలోకి కాదని.. ఈయన జనసేన వైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. జనసేనతో ఆల్మోస్ట్ సీట్ల ఒప్పందం కూడా కుదిరిపోయిందని సమాచారం.
ముద్రగడ కోటా కింద ఆరేడు సీట్లను ఇస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చాడట.
మరి ముద్రగడ చేరిక జనసేనకు ప్లస్ అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఇప్పటికే కాపుల పార్టీగా పవన్ కు పేరొచ్చేసింది. ఈ పార్టీలో అంతా కాపులే కనిపిస్తున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల ఉద్యమకారుడు కూడా చేరితే.. పవన్ పార్టీకి బీసీలతో పాటు ఇతర కమ్యూనిటీల వారు పూర్తిగా దూరం అవుతారనే అభిప్రాయాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.