బెల్లంకొండ సాయంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేధింపులు " శ్రీరెడ్డి

టాలీవుడ్‌లోని కామాంధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నటి శ్రీరెడ్డి మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను లైంగిక వేధించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా ఉన్నారని వివరించారు. ఒక తమిళ చానల్ తో మాట్లాడిన ఆమె… టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై బాణం ఎక్కు పెట్టారు. టీఆర్‌ఎస్‌ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని వివరించారు. అతడికి నిర్మాత బెల్లంకొండ సురేష్‌ సహకరించారని చెప్పారు. పార్క్‌ […]

Advertisement
Update:2018-10-14 01:16 IST

టాలీవుడ్‌లోని కామాంధులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న నటి శ్రీరెడ్డి మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. తనను లైంగిక వేధించిన వారిలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయనాయకులు కూడా ఉన్నారని వివరించారు. ఒక తమిళ చానల్ తో మాట్లాడిన ఆమె… టీఆర్‌ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై బాణం ఎక్కు పెట్టారు.

టీఆర్‌ఎస్‌ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను లైంగికంగా వేధించారని వివరించారు. అతడికి నిర్మాత బెల్లంకొండ సురేష్‌ సహకరించారని చెప్పారు. పార్క్‌ హయత్‌ హోటల్‌లో తనపై లైంగిక వేధింపులకు టీఆర్‌ఎస్‌ జీవన్ రెడ్డి పాల్పడ్డారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ జీవన్‌ రెడ్డికి అమ్మాయిలంటే పిచ్చి అని… ప్రతి రోజూ తనకు ఫోన్ చేసి వేధించేవాడని చెప్పారు.

తమ పార్టీ అధికారంలో ఉందని…. చెప్పినట్టు వినాలని బెదిరింపులకు దిగేవాడని శ్రీరెడ్డి వివరించారు. అతడికి బెల్లంకొండ సురేష్ సహకరించేవాడని చెప్పారు. దీంతో టీఆర్ఎస్‌లో కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన టీఆర్‌ఎస్‌ జీవన్‌ రెడ్డిపై ఈ తరహా ఆరోపణలు రావడంతో చర్చనీయాంశమైంది. దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News