రాయలసీమ మగ నేతలను చీర, గాజులతో సన్మానించనున్న ఆర్‌ఎస్‌యూ
గతంలో తెలంగాణ యాసను కించపరుస్తూ పలు సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ యాస భాషలను హేళన చేస్తే బట్టలూడదీసి తంతామని తెలంగాణ వాదులు హెచ్చరించడంతో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు తోకముడిచారు. చిత్రపరిశ్రమవారంతా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు కాకపోవడంతో పదేపదే వారి సినిమాల్లో కలెక్షన్ల కోసం ఈ ప్రాంతాల ప్రజలను నీచంగా చూపించడం అలవాటుగా చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ ప్రాంతాన్ని, అక్కడ ప్రజలను, అక్కడి […]
గతంలో తెలంగాణ యాసను కించపరుస్తూ పలు సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణ యాస భాషలను హేళన చేస్తే బట్టలూడదీసి తంతామని తెలంగాణ వాదులు హెచ్చరించడంతో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు తోకముడిచారు. చిత్రపరిశ్రమవారంతా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు కాకపోవడంతో పదేపదే వారి సినిమాల్లో కలెక్షన్ల కోసం ఈ ప్రాంతాల ప్రజలను నీచంగా చూపించడం అలవాటుగా చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ ప్రాంతాన్ని, అక్కడ ప్రజలను, అక్కడి యాసను చెడుగా చూపించే సాహసం సినిమావాళ్లు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారు ఉత్తరాంధ్ర, రాయలసీమను టార్గెట్ చేసుకుని కథలు అల్లుకుంటున్నారు. ఉత్తరాంధ్ర యాసను కించపరిచేలా ఆ మధ్య ఒక సినిమా తీయగా శ్రీకాకుళం వచ్చిన నిర్మాత దిల్‌రాజ్‌ను ఉత్తరాంధ్ర విద్యార్థులు కోడిగుడ్లు, చెప్పులతో కొట్టారు. దాంతో ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ కూడా చెప్పారు.
కానీ రాయలసీమపై మాత్రం సినిమావాళ్ల ప్రతాపం ఆగడం లేదు. ముఖ్యంగా స్టేజ్ ఎక్కితే విలువలు వల్లేవేసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతి సినిమాలోనూ రాయలసీమ ప్రాంతాన్ని ఏదో ఒక చోట నెగిటివ్‌గా చూపిస్తూనే ఉన్నారు. బోయపాటి శీను లాంటి వారిదీ ఇదే ధోరణి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన అరవింద సమేత చిత్రం రాయలసీమ ప్రాంతాన్ని నీచంగా చూపించింది. ఫ్యాక్షన్ మాసిపోయి చాలా కాలం అయినా వరుసగా ప్లాప్‌లు ఎదుర్కొంటున్న త్రివిక్రమ్ మాత్రం రాయలసీమపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు.
తాజా చిత్రంలో రాయలసీమ ప్రాంతాన్ని చూపిన తీరుపై ఆ ప్రాంత వాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా పనిగట్టుకుని రాయలసీమ ప్రాంతాన్ని కించపరుస్తూ సినిమాలు తీస్తున్నా సరే ఈ ప్రాంత నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన నాయకులు అమ్ముడుపోయారా లేక పౌరుషం చచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ స్టూడెంట్ యూనియన్ మరో అడుగు ముందుకేసింది.
ఈనెల 23న అనంతపురంలో రాయలసీమ మగ నేతలకు చీరలు, గాజులు అందజేసి సన్మానం చేస్తున్నట్టు యూనియన్ నాయకుడు కిరణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపుతున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి వారు రాకపోతే వారి చిత్రపటాలకు చీరలు గాజులు అందచేస్తామని విద్యార్థి నాయకులు వెల్లడించారు.
జన్మనిచ్చిన సొంత నేలను .. కథలు కల్పితాల చెప్పుకుంటూ బతికే సినిమావాళ్లు పదేపదే నీచంగా చూపుతున్నా స్పందించని సీమ నేతలు కనీసం మీసాలు తీసేసి అయినా నిరసన తెలపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.