క్రికెట్ ఫీల్డ్ లో అభిమానుల అత్యుత్సాహం

రాజ్ కోట్, హైదరాబాద్ టెస్టుల్లో విరాట్ అభిమానుల హల్ చల్ కొహ్లీతో సెల్ఫీ, ఆపైన కౌగిలించుకోబోయిన అభిమాని బారికేడ్లు దాటేస్తూ, ఫెన్సులు దూకేస్తున్న ఫ్యాన్స్ క్రీడాకారులకు…. ప్రధానంగా క్రికెటర్లకు అభిమానులే బలం. తమను పిచ్చిఅభిమానంతో ఆరాధించే అభిమానులను అలరించడం కోసమే విరాట్ కొహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే… కొన్నిసార్లు అదే అభిమానం హద్దులు మీరి… ఇబ్బందిగా మారే పరిస్థితి ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. రాజ్ కోట టెస్టులో మాత్రమే కాదు… ప్రస్తుత […]

Advertisement
Update:2018-10-14 04:30 IST
  • రాజ్ కోట్, హైదరాబాద్ టెస్టుల్లో విరాట్ అభిమానుల హల్ చల్
  • కొహ్లీతో సెల్ఫీ, ఆపైన కౌగిలించుకోబోయిన అభిమాని
  • బారికేడ్లు దాటేస్తూ, ఫెన్సులు దూకేస్తున్న ఫ్యాన్స్

క్రీడాకారులకు…. ప్రధానంగా క్రికెటర్లకు అభిమానులే బలం. తమను పిచ్చిఅభిమానంతో ఆరాధించే అభిమానులను అలరించడం కోసమే విరాట్ కొహ్లీ లాంటి స్టార్ క్రికెటర్లు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.

అయితే… కొన్నిసార్లు అదే అభిమానం హద్దులు మీరి… ఇబ్బందిగా మారే పరిస్థితి ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. రాజ్ కోట టెస్టులో మాత్రమే కాదు… ప్రస్తుత హైదరాబాద్ టెస్టులో సైతం… విరాట్ కొహ్లీ… ఫ్యాన్ ట్రబుల్ ను భరించాల్సి వచ్చింది.

సచిన్ టు కొహ్లీ….

క్రికెట్….భారత్ లో నంబర్ వన్ గేమ్. మనదేశంలో కొట్లాదిమంది అభిమానులున్న ఏకైక క్రీడ. కేవలం కోట్లాదిమంది వీరాభిమానం కారణంగానే క్రికెట్ వందలకోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది.

గత దశాబ్దంలో…. సచిన్ టెండుల్కర్ మ్యాచ్ ఆడుతుంటే…. కేవలం మాస్టర్ ఆట కోసమే.. స్టేడియాలు కిటకిటలాడుతూ ఉండేవి. అంతేకాదు…సచిన్ కు భారత అభిమానులు…క్రికెట్ దేవుడి హోదాను సైతం కట్టబెట్టారంటే….అభిమానులా … మజాకానా! అనుకోవాల్సిందే మరి.

సచిన్ రిటైర్మెంట్ తర్వాత……ఆ స్థానాన్ని భర్తి చేస్తున్న విరాట్ కొహ్లీ సైతం…దేశవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. తన ఆటతీరు, దూకుడు మనస్తతత్వంతో నేటితరం అభిమానులను కొహ్లీ అలరిస్తూ వస్తున్నాడు.

విరాట్ తో సెల్ఫీలు…

అంతేకాదు…ఈ స్మార్ట్ ఫోన్లు, సెల్ఫీల యుగంలో….తమ అభిమాన క్రీడాకారులతో ఫోటోలు దిగటానికి అభిమానులు పోటీపడటం రానురాను ఎక్కువై పోయింది.

దేశవ్యాప్తంగా వీరాభిమానులున్న.. కొహ్లీ లాంటి ఆటగాళ్లు…వ్యక్తిగత భద్రతా సిబ్బందికి తోడు….మ్యాచ్ నిర్వహకులు కల్పించే భద్రత ఉన్నా… అభిమానుల అత్యుత్సాహంతో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.

సాధారణంగా అభిమానులతో స్నేహపూర్వకంగా ఉంటూ…సెల్ఫీలు, ఫోటోలు దిగటానికి ఇష్టపడే విరాట్ కొహ్లీకి…వెస్టిండీస్ తో జరుగుతున్న ప్రస్తుత రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యింది.

రాజ్ కోట్ లో రగడ…

రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఇటీవలే ముగిసిన తొలిటెస్టులో…. విరాట్ కొహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ అభిమాని బారికేడ్ ను దాటేసి…ఇనుపకంచెను అధిగమించి…పిచ్ వైపుకు దూసుకొచ్చాడు. తన అభిమాన ఆటగాడు కొహ్లీతో సెల్ఫీ దిగి హల్ చల్ చేశాడు.

హైదరాబాద్ లోనూ అదే సీన్…

అంతేకాదు….హైదరాబాద్ రాజీవ్ స్టేడియం వేదికగా ప్రారంభమైన రెండోటెస్టులో సైతం అదేసీన్ పునరావృతమయ్యింది. మ్యాచ్ తొలిరోజు ఆటలోనే ….ఓ అభిమాని….సెక్యూరిటీ కళ్లుగప్పి…ఫీల్డింగ్ చేస్తున్న కొహ్లీ వైపుకు దూసుకొచ్చాడు. కొహ్లీతో సెల్ఫీ దిగటమే కాదు….కౌగిలించుకోడానికి ప్రయత్నించాడు. అయితే కొహ్లీ… అభిమాని ఉక్కు కౌగిలి నుంచి తప్పించుకోగలిగాడు.

ఆ తర్వాత భద్రతా సిబ్బంది వచ్చి…ఆ అగంతకుడిని తమతో ఈడ్చుకుపోయారు. ఇదంతా చూస్తుంటే…భారత క్రికెట్ స్టేడియాలలో ఏర్పాటు చేస్తున్న భద్రత డొల్లేనని చెప్పక తప్పదు. బారికేడ్లు, ఇనుపకంచెలు దాటి..దూసుకొచ్చే అభిమానుల దుస్సాహసాన్ని…కొహ్లీ లాంటి క్రికెటర్లు…ఎంత సమర్థించకుండా ఉంటే అంతమంచిది.

Tags:    
Advertisement

Similar News