నాయినికి 10 కోట్లు.... రేవంత్ ఫిర్యాదు.... చిక్కుల్లో కేసీఆర్

టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం కాస్త రోడ్డు మీదకొచ్చింది. అది ప్రతిపక్ష నేతలకు అందే ద్రాక్షలాగా మారిపోయింది. దీంతో ఈ తతంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కేసీఆర్ అంటేనే పడని రేవంత్ రెడ్డి ఇందులోకి ఎంటరయ్యాడు. తాజాగా కేసీఆర్ ను ఇరుకున పెడుతూ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. తాజా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం వేచి వేచి విసిగిపోయాడు. తనకు అచ్చొచ్చిన ముషీరాబాద్ సీటును […]

Advertisement
Update:2018-10-13 11:25 IST

టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం కాస్త రోడ్డు మీదకొచ్చింది. అది ప్రతిపక్ష నేతలకు అందే ద్రాక్షలాగా మారిపోయింది. దీంతో ఈ తతంగాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కేసీఆర్ అంటేనే పడని రేవంత్ రెడ్డి ఇందులోకి ఎంటరయ్యాడు. తాజాగా కేసీఆర్ ను ఇరుకున పెడుతూ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ కు శనివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు.

తాజా మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం వేచి వేచి విసిగిపోయాడు. తనకు అచ్చొచ్చిన ముషీరాబాద్ సీటును తన అల్లుడికి ఇవ్వాలని కోరుతూ కేసీఆర్ ను అభ్యర్థించేందుకు వెళ్లగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఎట్టకేలకు దర్శనమిచ్చి ముషీరాబాద్ వద్దు…. ఎల్బీనగర్ నుంచి పోటీచేస్తే పార్టీ ఫండ్‌గా 10 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడట. దీనిపై సీరియస్ అయిన నాయిని విలేకరుల ముందుకొచ్చి నోరు జారాడు. ప్రతీసారి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా మాట్లాడే నాయిని ఈసారి కూడా అదే స్థాయిలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు..

ఇప్పుడీ మాటలే రేవంత్ కు బంగారంగా దొరికేశాయి. కేసీఆర్ రూ.10 కోట్లు ఇచ్చి పోటీచేయించి ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కాడని…. డబ్బులతో ఎన్నికల ను ప్రభావితం చేస్తున్నారని…. నాయిని మాట్లాడిన వీడియోలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టికెట్ వ్యవహారం…. డబ్బుల పంపిణీ పంచాయతీ ఈసీ వద్దకు చేరింది. రేవంత్ స్వయంగా ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. దీనిపై ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. అదును చూసి కేసీఆర్ ను రేవంత్ ఇరికించడం రాజకీయంగా సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News