రాఫెల్ పై రాస్తావా.... మీడియాధిపతిపై మోడీ ప్రతీకారం....

అధికారంలో ఉన్నవారికి కాసింత ఓపిక, విమర్శలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. కానీ బీజేపీని ఒంటిచేత్తో గద్దెనెక్కించిన మోడీ.. ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న వేళ.. పూర్తిగా అదుపుతప్పుతున్నారు. తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న వారిపై ఐటీ దాడులకు పురిగొల్పుతున్నారు. ఇక ఇప్పుడు క్వింట్ మీడియా పోర్టల్, నెట్ వర్క్ 18 వ్యవస్థాపకుడు, మీడియా టైకూన్ అయిన రాఘవ్ బహ్ల్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. నోయిడాలోని ఆయన ఆస్తులపై సోదాలు జరిపి పలు పత్రాలను స్వాధీనం […]

Advertisement
Update:2018-10-12 06:00 IST

అధికారంలో ఉన్నవారికి కాసింత ఓపిక, విమర్శలను కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. కానీ బీజేపీని ఒంటిచేత్తో గద్దెనెక్కించిన మోడీ.. ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న వేళ.. పూర్తిగా అదుపుతప్పుతున్నారు. తనపై వ్యతిరేక వార్తలు రాస్తున్న వారిపై ఐటీ దాడులకు పురిగొల్పుతున్నారు.

ఇక ఇప్పుడు క్వింట్ మీడియా పోర్టల్, నెట్ వర్క్ 18 వ్యవస్థాపకుడు, మీడియా టైకూన్ అయిన రాఘవ్ బహ్ల్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. నోయిడాలోని ఆయన ఆస్తులపై సోదాలు జరిపి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

రాఘవ్ బహ్ల్ తన క్వింట్ న్యూస్ లో కొద్దిరోజులుగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కథనాలు రాయిస్తున్నారు. రాఫెల్ కుంభకోణానికి మోడీ కారణమంటూ సంచలన కథనాలు వేస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవ్ పై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది.

బీజేపీకి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నందునే ఈ దాడులు చేసినట్టు అర్థమవుతోందని రాఘవ్ ఆరోపించారు. ఈ మేరకు మోడీ మీడియాను భయపెడుతున్నారని ఎడిటర్స్ గిల్డ్ కు ఫిర్యాదు చేశారు. కేంద్రంపై వాస్తవాలు రాస్తున్నందుకే బహుమతిగా క్విట్ పై దాడులు నిర్వహించారని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం, మోడీలో వచ్చిన ఈ మార్పు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మోడీకి వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా.. తన చెప్పుచేతుల్లో ఉన్న ఐటీ అధికారులను ఉపయోగించుకొని దాడులకు తెగబడడం విస్మయం కలిగిస్తోంది. గడిచిన కాంగ్రెస్ హయాంలోనూ ఐటీదాడులు జరిగినా…. ఇంత పక్షపాతంగా, కక్ష సాధింపుగా జరగలేదని బీజేపీకి చెందిన కేంద్ర మాజీ ఆర్థికమంత్రి యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్ధం పడుతోంది.

Tags:    
Advertisement

Similar News