హైదరాబాద్ టెస్టు తొలిరోజు ఆటలో విండీస్ షో

తొలిరోజుఆటలో 7 వికెట్లకు 295 పరుగులు రోస్టన్ చేజ్ 98 నాటౌట్, హోల్డర్ 52 పరుగులు ఉమేశ్ యాదవ్,కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు హైదరాబాద్ టెస్ట్ తొలిరోజు ఆటను… వెస్టిండీస్ సంతృప్తికరంగా ముగించింది. దూకుడుమీదున్న టీమిండియా బౌలర్లను మిడిలార్డర్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్ ఫైటింగ్ బ్యాటింగ్ తో నిలువరించారు.  95 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను ముగించగలిగారు. అంతకుముందు…విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ […]

Advertisement
Update:2018-10-12 17:25 IST
  • తొలిరోజుఆటలో 7 వికెట్లకు 295 పరుగులు
  • రోస్టన్ చేజ్ 98 నాటౌట్, హోల్డర్ 52 పరుగులు
  • ఉమేశ్ యాదవ్,కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు

హైదరాబాద్ టెస్ట్ తొలిరోజు ఆటను… వెస్టిండీస్ సంతృప్తికరంగా ముగించింది. దూకుడుమీదున్న టీమిండియా బౌలర్లను మిడిలార్డర్ ఆటగాళ్లు రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్ ఫైటింగ్ బ్యాటింగ్ తో నిలువరించారు.

95 ఓవర్లలో 7 వికెట్లకు 295 పరుగుల స్కోరుతో తొలిరోజు ఆటను ముగించగలిగారు. అంతకుముందు…విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ కీలక టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకోడంతో… టెస్ట్ మ్యాచ్ ప్రారంభమయ్యింది.

రెండుజట్లూ ఒక్కో మార్పుతో పోటీకి దిగాయి. లంచ్ విరామానికే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ ను…6వ వికెట్ కు చేజ్- డారిచ్, 7వ వికెట్ కు చేజ్- హోల్డర్ కీలక భాగస్వామ్యాలతో ఆదుకొన్నారు.

రోస్టన్ చేజ్ 174 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 98 పరుగుల స్కోరుతో అజేయంగా నిలువగా…కెప్టెన్ హోల్డర్ 92 బాల్స్ లో 6 బౌండ్రీలతో 52 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

రాజ్ కోట్ లో గతవారం ముగిసిన తొలిటెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 48 ఓవర్లలోనే 181 పరుగులకే కుప్పకూలిన విండీస్…హైదరాబాద్ టెస్టు తొలిరోజు ఆటలో 95 ఓవర్ల పాటు నిలవటం ద్వారా విమర్శకులకు దీటైన జవాబు చెప్పింది.

Tags:    
Advertisement

Similar News