మతం ఆధారంగా విద్యార్థుల విభజన

ఈ దేశంలో అక్కడక్కడ విపరీత పోకడలు బయటపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో మతం అన్నది మనుషుల మధ్య విభజన సృష్టించే పెద్ద రేఖగా తయారవుతోంది. ఇందుకు కొందరు ఆజ్యం పోస్తున్నారు. ఢిల్లీలోని ఒక మున్సిపల్ స్కూల్‌లో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌ ఏకంగా మతం ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విభజించేశారు. ఈ విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పజీరాబాద్‌లో నడుస్తున్న స్కూల్‌లో విద్యార్థులను హిందూ, ముస్లిం మతం ఆధారంగా విభజించారు. ఈ అంశంపై […]

Advertisement
Update:2018-10-11 03:41 IST

ఈ దేశంలో అక్కడక్కడ విపరీత పోకడలు బయటపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో మతం అన్నది మనుషుల మధ్య విభజన సృష్టించే పెద్ద రేఖగా తయారవుతోంది. ఇందుకు కొందరు ఆజ్యం పోస్తున్నారు. ఢిల్లీలోని ఒక మున్సిపల్ స్కూల్‌లో ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్‌ ఏకంగా మతం ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విభజించేశారు.

ఈ విషయం బయటకు రావడంతో దుమారం రేగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పజీరాబాద్‌లో నడుస్తున్న స్కూల్‌లో విద్యార్థులను హిందూ, ముస్లిం మతం ఆధారంగా విభజించారు. ఈ అంశంపై కొందరు ఉపాధ్యాయులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తన చర్యను ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ షెరావత్ సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.

స్కూల్‌లో శాంతి, క్రమశిక్షణ ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని చెప్పారు. అదే సమయంలో తాను మతం ఆధారంగా సెక్షన్లను విభజించలేదని… సాధారణ పద్దతి ప్రకారమే విద్యార్థులను విభజించానని చెబుతున్నారు.

ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఏ సెక్షన్‌లో మొత్తం హిందూ మత విద్యార్థులనే ఉంచారు. బీ సెక్షన్లతో మొత్తం ముస్లిం విద్యార్థులను ఉంచారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News