ఫాస్ట్‌ఫుడ్స్‌తో మెదడుకు కష్టమే!
పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా? అయితే మీ మెదడుకు కష్టాలు తప్పవంటున్నారు పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్ వల్ల స్థూలకాయం, రక్తపోటు వంటి వ్యాధులు వస్తాయని మనకు ఇంత వరకు తెలిసిన విషయం. అయితే వీటి వల్ల మన మెదడు ఆలోచన స్థాయిపై కూడా ప్రభావం ఉంటుందని పరిశోధకులంటున్నారు. పరిమితికి మించి ఫ్యాటీ ఆహారాన్ని తీసుకుంటే మన మెదడు ఆలోచన స్థాయి నిలకడ తప్పుతుందని వారంటున్నారు. మెదడుపై తీవ్ర వత్తిడి కలగడమే కాక చివరకు […]
Advertisement
పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టంగా లాగించేస్తున్నారా? అయితే మీ మెదడుకు కష్టాలు తప్పవంటున్నారు పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్ వల్ల స్థూలకాయం, రక్తపోటు వంటి వ్యాధులు వస్తాయని మనకు ఇంత వరకు తెలిసిన విషయం. అయితే వీటి వల్ల మన మెదడు ఆలోచన స్థాయిపై కూడా ప్రభావం ఉంటుందని పరిశోధకులంటున్నారు. పరిమితికి మించి ఫ్యాటీ ఆహారాన్ని తీసుకుంటే మన మెదడు ఆలోచన స్థాయి నిలకడ తప్పుతుందని వారంటున్నారు. మెదడుపై తీవ్ర వత్తిడి కలగడమే కాక చివరకు మానసిక వైకల్యం కూడా కలిగే ప్రమాదముందని అంటున్నారు. పరిమితికి మించి కొవ్వు పదార్ధాలను తినేవారి మానసిక ప్రవర్తనలో విపరీతమైన మార్పులు సంభవించే అవకాశముందని లూసియానా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. కొవ్వు పదార్ధాలు అతిగా తీసుకంంటే మన నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతున్నట్లు వారు గుర్తించారు. జీర్ణాశయం నుంచి మెదడుకు వెళ్లే సమాచార వ్యవస్థలో కొవ్వు కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వారు తమ పరిశోధనలో కనుగొన్నారు. ఈ పరిశోధన వివరాలను బయోలాజికల్ సైకియాట్రి అనే జర్నల్‌లో ప్రచురించారు.
Advertisement