ధియేటర్స్ బిజినెస్ లోకి ప్రభాస్

“బాహుబలి” సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ సొంత సంస్థ అయిన యువి క్రియేషన్స్ చేతిలో కొన్ని థియేటర్ లు , మల్టీప్లెక్స్ లు ఉండగా తాజాగా దాన్ని మరింతగా విస్తృతం చేయాలనీ డిసైడ్ అయ్యారట ప్రభాస్ టీం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని థియేటర్ లను లీజు కి తీసుకోవడం కానీ కొనడం కానీ చేసి వాటి రూపురేఖలు మార్చేసి కొత్త కొత్త […]

Advertisement
Update:2018-10-08 11:25 IST

“బాహుబలి” సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్న ప్రభాస్ ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ సొంత సంస్థ అయిన యువి క్రియేషన్స్ చేతిలో కొన్ని థియేటర్ లు , మల్టీప్లెక్స్ లు ఉండగా తాజాగా దాన్ని మరింతగా విస్తృతం చేయాలనీ డిసైడ్ అయ్యారట ప్రభాస్ టీం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొన్ని థియేటర్ లను లీజు కి తీసుకోవడం కానీ కొనడం కానీ చేసి వాటి రూపురేఖలు మార్చేసి కొత్త కొత్త సినిమాలను అందులో ప్రదర్శించాలని అదే వీళ్ళ బిజినెస్.

ఎలాగూ ప్రభాస్ తో పాటుగా మిగతా వాళ్ళు కూడా సినిమారంగంలోనే ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన బిజినెస్ నే చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యి ఈ బిజినెస్ చేస్తున్నారట. ప్రభాస్ ఎలాగూ సినిమాల్లో నటిస్తున్నాడు అలాగే యువి క్రియేషన్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మిస్తున్నారు దానికి తోడు కొన్ని సినిమాలను ఏరియాల వారీగా కొంటూ పంపిణీ చేస్తున్నారు అందుకే థియేటర్ ల లీజు కి దిగారు ప్రభాస్ టీం. మరి ఈ బిజినెస్ ద్వారా ప్రభాస్ సక్సెస్ అవుతాడో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు.

Tags:    
Advertisement

Similar News