త్వరలోనే బాబును కలిసి సమస్యలపై మాట్లాడతా " మాజీ జేడీ
తన ఆలోచనలకు అనుగుణంగా ఉండే రాజకీయ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఒకవేళ అలా కలిసే అవకాశం రాకపోతే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి ముందుకెళ్తానన్నారు. డబ్బు తీసుకోకుండా 50 శాతం మంది ఓటు వేస్తే చాలని అప్పుడు మంచి పాలన వస్తుందన్నారు. డబ్బుతో పనిలేని ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే అభ్యర్థుల నుంచి వందరూపాయల స్టాంప్ పేపర్‌లో హామీ తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఒకవేళ […]
తన ఆలోచనలకు అనుగుణంగా ఉండే రాజకీయ పార్టీతో కలిసి పనిచేసేందుకు తాను సిద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఒకవేళ అలా కలిసే అవకాశం రాకపోతే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి ముందుకెళ్తానన్నారు. డబ్బు తీసుకోకుండా 50 శాతం మంది ఓటు వేస్తే చాలని అప్పుడు మంచి పాలన వస్తుందన్నారు.
డబ్బుతో పనిలేని ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సమయంలో వచ్చే అభ్యర్థుల నుంచి వందరూపాయల స్టాంప్ పేపర్‌లో హామీ తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఒకవేళ గెలిచిన తర్వాత సదరు అభ్యర్థి హామీలు నెరవేర్చకుంటే కోర్టులో పిల్ వేయవచ్చన్నారు. ప్రజల నుంచి సమస్యలను తెలుసుకునేందుకు ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రజల నుంచి వచ్చిన వినతులు, వారు చెప్పిన సమస్యలపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుస్తానని లక్ష్మీనారాయణ చెప్పారు. వాటిని పరిష్కరించాల్సిందిగా చంద్రబాబును కోరుతానన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తూ, నిధులు విడుదల చేస్తుంటేచాలన్నారు.
అయితే తన ఆలోచనకు అనుగుణంగా ఉండే పార్టీతో కలిసి పనిచేస్తామని లక్ష్మీనారాయణ చెబుతున్న నేపథ్యంలో…. ఒకవేళ ఆయన తీసుకెళ్లే సమస్యలను చంద్రబాబు పరిష్కరించేందుకు అంగీకరిస్తే టీడీపీతో కూడా కలిసి పనిచేస్తారా అన్నది చూడాలి.
గతంలో విభేదాలు రాకముందు పవన్ కల్యాణ్ తీసుకెళ్లిన సమస్యలను కూడా చంద్రబాబు పరిష్కరించేందుకు ప్రయత్నించే వారు. ఇప్పుడు చంద్రబాబు అలాగే చేస్తే మాజీ జేడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.