వైసీపీలో మరో మార్పు.... వైఎస్ వివేకానంద రెడ్డి బ్యాక్?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గత ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సౌమ్యుడిగా, వివాద రహితుడుగా అవినాష్ రెడ్డికి పేరుంది. అయితే కడప రాజకీయంలో ఇంత సౌమ్యంగా ఉంటే బావుండదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేఫథ్యంలో వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని జగన్ మరో రకంగా వాడుకోనున్నాడని…. అక్కడ మరొకరిని అభ్యర్థిగా రంగంలోకి దించనున్నాడని వార్తలు వస్తున్నాయి. మొదట షర్మిల పేరు వినిపించింది. కడప ఎంపీగా షర్మిల […]

Advertisement
Update:2018-10-05 03:45 IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గత ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సౌమ్యుడిగా, వివాద రహితుడుగా అవినాష్ రెడ్డికి పేరుంది. అయితే కడప రాజకీయంలో ఇంత సౌమ్యంగా ఉంటే బావుండదు అనే అభిప్రాయం కూడా ఉంది. ఈ నేఫథ్యంలో వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డిని జగన్ మరో రకంగా వాడుకోనున్నాడని…. అక్కడ మరొకరిని అభ్యర్థిగా రంగంలోకి దించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

మొదట షర్మిల పేరు వినిపించింది. కడప ఎంపీగా షర్మిల పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి పేరు వినిపిస్తుండటం విశేషం. వచ్చే ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పోటీ చేయరని… వివేకానందరెడ్డి కడప నుంచి ఎంపీగా రంగంలోకి దిగవచ్చని వార్తలు వస్తున్నాయి. కడప జిల్లా వ్యాప్తంగా వివేకానందరెడ్డికి పరిచయాలకు లోటు లేదు.

గతంలో వైఎస్ ఈ సీటు నుంచి తప్పుకున్నాక వివేకానందరెడ్డికి అవకాశం వచ్చింది. జగన్ ఎంట్రీ తర్వాత వివేక తప్పుకోవాల్సి వచ్చింది. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్ వివేకానందరెడ్డిని జగన్ కు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. అయితే వివేకకు భంగపాటు తప్పలేదు. ఆ తర్వాత వివేకను తన వద్దకే తెచ్చుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి.

ఈ నేపథ్యంలో…. వివేకానందరెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచన జగన్ కు ఉన్నట్టుగా తెలుస్తోంది. అది జరిగిన పక్షంలో అవినాష్ రెడ్డిని మరో రకంగా పార్టీకోసం వాడుకోనున్నారని సమాచారం.

Tags:    
Advertisement

Similar News