కడపలో ఆయనకు గాలం వేస్తున్న చంద్రబాబు!
తెలుగుదేశం అధినేతకు ఇంకా నాయకులు సరిపోవడం లేదు. పార్టీలో ఉన్న పాత నేతలు, ఫిరాయింపుదారులు…. వీళ్లంతా ఉన్నా బాబుకు చాలడం లేదు. ఇప్పటికే ఉన్న వారి మధ్యన రకరకాల రచ్చలు సాగుతున్నాయి. ప్రత్యేకించి టికెట్ల విషయంలో పోరు కొనసాగుతూ ఉంది. వారి వ్యవహారాలను చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చలేకపోతున్నాడు కానీ.. ఇప్పుడు అభ్యర్థిత్వాల విషయంలో కొత్త వాళ్లకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కడప జిల్లాలో చంద్రబాబు మరో నేతకు గాలం వేస్తున్నాడట. ఆయన మరెవరో […]
తెలుగుదేశం అధినేతకు ఇంకా నాయకులు సరిపోవడం లేదు. పార్టీలో ఉన్న పాత నేతలు, ఫిరాయింపుదారులు…. వీళ్లంతా ఉన్నా బాబుకు చాలడం లేదు. ఇప్పటికే ఉన్న వారి మధ్యన రకరకాల రచ్చలు సాగుతున్నాయి. ప్రత్యేకించి టికెట్ల విషయంలో పోరు కొనసాగుతూ ఉంది. వారి వ్యవహారాలను చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చలేకపోతున్నాడు కానీ.. ఇప్పుడు అభ్యర్థిత్వాల విషయంలో కొత్త వాళ్లకు గాలం వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగా కడప జిల్లాలో చంద్రబాబు మరో నేతకు గాలం వేస్తున్నాడట. ఆయన మరెవరో కాదు…. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. కాంగ్రెస్ హయాంలో బాగా వార్తల్లో నిలిచిన డీఎల్ గత నాలుగేళ్లుగా అడ్రస్ లేడు. గత ఎన్నికల సమయంలో ఏదో హడావుడి చేయబోయి, ఎన్నికల తర్వాత మీడియాకు మొహం చాటేశాడు డీఎల్. ఇక ఎన్నికలు మళ్లీ వస్తున్న తరుణంలో డీఎల్ మళ్లీ యాక్టివేట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు.
ఈయన వైసీపీలో చేరబోతున్నట్టుగా కొన్నాళ్లు, టీడీపీలో చేరబోతున్నట్టుగా మరి కొన్నాళ్లు వార్తలు వస్తూ ఉంటాయి. అయితే డీఎల్ ఎటూ చేరడం లేదు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు డీఎల్ ను చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడట. కడప ఎంపీగా డీఎల్ ను పోటీ చేయించాలనేది చంద్రబాబు ప్రయత్నంగా తెలుస్తోంది. కడప ఎంపీ సీటుకు టీడీపీకి ఇప్పటి వరకూ సరైన నేత లేడు. ఈ నేపథ్యంలో డీఎల్ ను చేర్చుకుని కడప ఎంపీగా పోటీ చేయించాలని బాబు ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
అయితే.. డీఎల్ అందుకు సై అంటాడా? అనేది సందేహమే. ఎందుకంటే కడప ఎంపీగా ఇంత వరకూ వైఎస్ కుటుంబాన్ని ఓడించిన వారు లేరు. మహామహులు పోటీ చేసి వైఎస్ కుటుంబీకుల చేతిలో ఓడారక్కడ. అలాంటి చోట పోటీకి డీఎల్ ముందుకు వస్తాడా?