వ్యవసాయానికి నోబెల్‌ ఫ్రైజ్‌.... మళ్లీ బాబు నవ్వులపాలు

ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబు మాటలకు ఇటీవల పొంతన ఉండడం లేదు. ఏది అనిపిస్తే అది అనేస్తున్నారు. 2018లోనే అమరావతిలో ఒలంపిక్స్‌ నిర్వహిస్తానని చెప్పి దేశాన్ని నివ్వెరపరిచిన చంద్రబాబు… తాజాగా నోబెల్‌ ప్రైజ్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు…. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నోబెల్ బహుమతి గెలిస్తే వందల కోట్లు ఇస్తానని […]

Advertisement
Update:2018-10-05 17:52 IST

ప్రపంచానికి పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబు మాటలకు ఇటీవల పొంతన ఉండడం లేదు. ఏది అనిపిస్తే అది అనేస్తున్నారు. 2018లోనే అమరావతిలో ఒలంపిక్స్‌ నిర్వహిస్తానని చెప్పి దేశాన్ని నివ్వెరపరిచిన చంద్రబాబు… తాజాగా నోబెల్‌ ప్రైజ్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తానని గతంలో ప్రకటించిన చంద్రబాబు…. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రైతులు నోబెల్ బహుమతి గెలిస్తే వందల కోట్లు ఇస్తానని ప్రకటించారు. విజయవాడలో జరిగిన రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు వ్యవసాయంలో నోబెల్ ప్రైజ్‌కు వంద కోట్లు అనగానే టీడీపీ నేతలు చప్పట్లు కొట్టారు. కానీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం బాబుకు క్లాస్ పీకుతున్నారు. అసలు నోబెల్‌ ప్రైజ్ ఏఏ రంగాల్లో ఇస్తారో తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. నోబెల్ ప్రైజ్‌ను కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, సాహిత్యం, శాంతి , ఆర్థిక రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులకు మాత్రమే ఇస్తారు. కానీ చంద్రబాబు మాత్రం వ్యవసాయంలో నోబెల్ ప్రైజ్ గెలవమని పిలుపునివ్వడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి 2017 జులై 28న కూడా చంద్రబాబు ఇలాంటి ప్రకటనే చేశారు. ఇప్పుడు నోబెల్ ప్రైజ్‌ వ్యవసాయానికి కూడా ఇస్తారంటున్నారు బాబు. ఇటీవల తాను అమెరికాలో యూఎన్‌వోలో ప్రకృతి వ్యవసాయంపై ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపరిచారు. రెండు రోజుల క్రితమే చినబాబు సంపదనుంచి చెత్త సృష్టిస్తానని ప్రవచించి చేసిన కామెడీ మరవకముందే పెదబాబు మళ్ళీ ఇలాంటి కామెడీ సృష్టించడం ఏమిటని నెటిజన్‌ లు జోకులేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News