హరీష్‌తో విభేదాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తనకు, హరీష్‌కు మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ మధ్య పోటీ ఉంటే అభివృద్ధిలో మాత్రమే ఉందన్నారు. పొరపాటున కూడా పొరపొచ్చాలు తమ మధ్య రావన్నారు. హరీష్ రావు కోరిక అయినా, తన కోరిక అయినా కేసీఆర్ మరో 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాలన్నదే అన్నారు. సిరిసిల్లలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పాల్గొన్నారు. కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి, పేదలకు మంచి జరుగుతుందన్నదే […]
తనకు, హరీష్‌కు మధ్య ఏవో విభేదాలు ఉన్నాయని చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ మధ్య పోటీ ఉంటే అభివృద్ధిలో మాత్రమే ఉందన్నారు. పొరపాటున కూడా పొరపొచ్చాలు తమ మధ్య రావన్నారు. హరీష్ రావు కోరిక అయినా, తన కోరిక అయినా కేసీఆర్ మరో 15ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించాలన్నదే అన్నారు. సిరిసిల్లలో జరిగిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ పాల్గొన్నారు.
కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరుగులు పెట్టిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలోనే మాట్లాడిన హరీష్ రావు… ఆత్మహత్యల సిరిసిల్లను కేసీఆర్ సిరుల సిరిసిల్లగా మార్చారని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట రికార్డ్ మెజారిటీని దాటేలా కేటీఆర్‌ను గెలిపించాలని కోరారు. సిద్దిపేట అభివృద్ధి వెనుక 30ఏళ్ల శ్రమ దాగి ఉందన్నారు హరీష్ రావు.