వంగవీటి రాధా పార్టీ మారడంపై పెద్దిరెడ్డి క్లారిటీ
వంగవీటి రాధా పార్టీ మారుతారన్న వార్తలను వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. రాధా తమ పార్టీలోనే ఉంటారన్నారు. ఇటీవల రాధాను విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించి విజయవాడ తూర్పు, లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరిన నేపథ్యంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాధా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాధా పార్టీ మారే అవకాశమే లేదన్నారు. వైఎస్ జగనే స్వయంగా […]
వంగవీటి రాధా పార్టీ మారుతారన్న వార్తలను వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. రాధా తమ పార్టీలోనే ఉంటారన్నారు. ఇటీవల రాధాను విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించి విజయవాడ తూర్పు, లేదా మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరిన నేపథ్యంలో పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రాధా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాధా పార్టీ మారే అవకాశమే లేదన్నారు. వైఎస్ జగనే స్వయంగా రాధాతో గంట పాటు మాట్లాడారని చెప్పారు. వంగవీటి రాధా పార్లమెంట్‌కు పోటీ చేసినా, అసెంబ్లీకి పోటీ చేసినా టికెట్ కేటాయించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని వివరించారు.
రాధాకు అండగా పార్టీ మొత్తం ఉంటుందన్నారు. పలుచోట్ల కో ఆర్డినేటర్లను తొలగించడంపైనా పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతోనే కో ఆర్డినేటర్లను తొలగించి కొత్తవారిని నియమించామన్నారు. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు పార్టీ సర్వేలు చేయించి రిపోర్టులు తెచ్చుకుంటోందన్నారు.
పని తీరు సరిగా లేని పక్షంలో కొన్ని చోట్ల మార్పులు చేయడం సహజమేనన్నారు. ఇదే పని చంద్రబాబు కూడా చేస్తున్నారని.. కానీ ఆయన్ను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇటీవల కొండ్రు మురళీని చంద్రబాబు పార్టీలోకి ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారో తెలియదా అని ప్రశ్నించారు. కాబట్టి పార్టీ గెలుపు కోసం ఒకటి రెండు చోట్ల మార్పులు చేయడం సహజమేనన్నారు.