టీడీపీ ఎమ్మెల్సీ, గీతం అధినేత దుర్మరణం

ప్రముఖ విద్యాసంస్థ గీతం వర్శిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చనిపోయారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఫోర్డ్…. ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మూర్తి అక్కడికక్కడే చనిపోయారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వెలవోలు బసవ పున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్‌ చౌదరి కూడా మృత్యువాతపడ్డారు. వీరంతా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని చూసేందుకు వెళ్తున్న సమయంలో […]

Advertisement
Update:2018-10-03 02:46 IST

ప్రముఖ విద్యాసంస్థ గీతం వర్శిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి చనిపోయారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. అలస్కాలోని ఆంకరేజ్‌ సిటీ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న వాహనం ఫోర్డ్…. ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

మూర్తి అక్కడికక్కడే చనిపోయారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వెలవోలు బసవ పున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్‌ చౌదరి కూడా మృత్యువాతపడ్డారు. వీరంతా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈప్రమాదం జరిగింది.

అక్టోబర్ 6న కాలిఫోర్నియాలో గీతం పూర్వ విద్యార్థి సమావేశంలో ఎంవీవీఎస్ మూర్తి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించవలసి ఉంది.

ఈయన తూర్పుగోదావరి జిల్లా ఐనవల్లి మండలం మూలపులంలో జన్మించారు. గోల్డ్‌ స్పాట్ అనే డ్రింక్‌ తయారీని ఆయన తొలుత ప్రారంభించారు. అందుకే ఈయన్ను గోల్డ్ స్పాట్ మూర్తి అని పిలుస్తుంటారు. టీడీపీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. 1991, 1999లో రెండుసార్లు విశాఖ ఎంపీగా ఎన్నికయ్యారు ఎంవీవీఎస్ మూర్తి.

Tags:    
Advertisement

Similar News