విజయనగరం నుంచి కోలగట్ల ....
విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్… విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించారు. కోటగట్ల వీరభద్రస్వామి పేరును జగన్ ప్రకటించారు. కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం స్థానం నుంచి పోటీ చేస్తారని… మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందని కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కోలగట్ల మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఆయనకు విజయనగరం జిల్లా […]
విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్… విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించారు. కోటగట్ల వీరభద్రస్వామి పేరును జగన్ ప్రకటించారు.
కోలగట్ల వీరభద్రస్వామి విజయనగరం స్థానం నుంచి పోటీ చేస్తారని… మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందని కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరారు.
2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన కోలగట్ల మొన్నటి ఎన్నికల్లో విజయనగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఆయనకు విజయనగరం జిల్లా అధ్యక్ష పదవిని జగన్ అప్పగించారు. పార్టీ తరపున ఎమ్మెల్సీని చేశారు. కాకపోతే బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరిన తర్వాత కోలగట్ల అసంతృప్తిగా ఉన్నారని…. పార్టీ మారబోతున్నారని పలుమార్లు వార్తలొచ్చాయి. అయితే వాటిని ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు విజయనగరం అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో ఇంతకాలం జరిగిన ప్రచారం తేలిపోయింది.