బీజేపీలో చేరిన అశోక్ గజపతి రాజు అన్న కూతురు!
ఒకవైపు మోడీని విమర్శిస్తూ ఉన్నాడు అశోక్ గజపతి రాజు. మొన్నటి వరకూ మోడీ మంత్రిత్వ శాఖలో ఈయన కూడా ఒక మంత్రి. అప్పుడంతా మోడీని ఒక రేంజ్ లో పొగిడేవాడీయన. ఒక దశలో ఈయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతాడనే ప్రచారం కూడా జరిగింది. అలా మోడీ భజన చేస్తూ వచ్చిన అశోక్ గజపతి చివరకు చంద్రబాబు ఆదేశాల మేర కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఇక ఇప్పుడు ఈయన చంద్రబాబు లైన్ ప్రకారం […]
ఒకవైపు మోడీని విమర్శిస్తూ ఉన్నాడు అశోక్ గజపతి రాజు. మొన్నటి వరకూ మోడీ మంత్రిత్వ శాఖలో ఈయన కూడా ఒక మంత్రి. అప్పుడంతా మోడీని ఒక రేంజ్ లో పొగిడేవాడీయన. ఒక దశలో ఈయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతాడనే ప్రచారం కూడా జరిగింది. అలా మోడీ భజన చేస్తూ వచ్చిన అశోక్ గజపతి చివరకు చంద్రబాబు ఆదేశాల మేర కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశాడు.
ఇక ఇప్పుడు ఈయన చంద్రబాబు లైన్ ప్రకారం మోడీని విమర్శిస్తూ ఉన్నాడు. మోడీ విధానాలను తప్పుపడుతూ ఉన్నాడు. నాలుగు సంవత్సరాల పాటు మోడీని పొగిడిన నోళ్లతోనే ఇప్పుడు తెలుగుదేశం వాళ్లంతా ఆయనను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆ బ్యాచ్ లో అశోక్ గజపతి కూడా ఒకరయ్యారు.
మరి ఈయనైతే ఇలా మోడీని విమర్శిస్తున్నాడు కానీ…. వీరి కుటుంబీకులు మాత్రం ఎంచక్కా బీజేపీలో చేరిపోతున్నారు. తాజాగా అశోక్ గజపతి సోదరుడి కూతురు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అశోక్ గజపతి సోదరుడు ఆనందగజపతి గతంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా వ్యవహరించాడు. ఆయన కూతురు సంచిత బీజేపీలో చేరారు.
ఆనందగజపతి రాజు మాత్రమే కాదు ఆయన భార్య ఉమా కూడా గతంలో ఎంపీగా వ్యవహరించారు. ఇప్పుడు వారి కూతురు బీజేపీలో చేరిపోయారు. అశోక్ గజపతికి ఇది అంత మింగుడుపడే విషయం కాదు. మొన్నటి వరకూ ఈయన బీజేపీని ప్రశంసించాడు, ఇప్పుడు తిడుతున్నాడు. ఇప్పుడు వీరి కుటుంబీకులే బీజేపీలోకి చేరిపోయారు. ఇదీ కథ. వచ్చే ఎన్నికల్లో తన కూతురును రాజకీయాల్లోకి తీసుకురావడానికి అశోక్ గజపతి ప్రయత్నిస్తున్నాడు.