టీ కాంగ్రెస్‌కు "నోటా" భయం....
తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ జనం ముందుకు వస్తున్న నోటా చిత్రం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా అధికార పార్టీకి అనుకూలంగా ఉందన్న ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్నికలు ముగిసే వరకు విడుదల కాకుండా అడ్డుకోవాలన్న డిమాండ్ కూడా మొదలైంది. ఇప్పటికే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజిత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నోటా చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని… ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమా తీశారని […]
తెలంగాణ ముందస్తు ఎన్నికల వేళ జనం ముందుకు వస్తున్న నోటా చిత్రం పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా అధికార పార్టీకి అనుకూలంగా ఉందన్న ఆరోపణ ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఎన్నికలు ముగిసే వరకు విడుదల కాకుండా అడ్డుకోవాలన్న డిమాండ్ కూడా మొదలైంది.
ఇప్పటికే నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజిత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నోటా చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని… ఒక పార్టీకి అనుకూలంగా ఈ సినిమా తీశారని ఆరోపించారు. ఈసీ తిలకించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గూడురు నారాయణరెడ్డి ఈ చిత్రంపై విమర్శలు చేశారు. నోటా సినిమా వల్ల ఓటర్లు నోటాకు ఓటేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ పరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని కోరారు.
ఈ విమర్శలపై చిత్ర హీరో విజయ్ దేవరకొండ ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో నోటా బటన్‌ను నొక్కాల్సిందిగా తాము ఎవరికీ చెప్పడం లేదన్నారు. ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ఈ చిత్రాన్ని తీయలేదన్నారు. అసలు ఈ సినిమా వల్ల కొందరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే పవర్ మాత్రం మన దగ్గర ఉందని…. ఈ సినిమాలో ఒక యువ ముఖ్యమంత్రిని చూస్తారని విజయ్ వ్యాఖ్యానించారు.