నాలుగు రోజుల్లో నిర్ణయం చెబుతా " లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు జిల్లాకు చెందిన మరో నియోజకవర్గ వైసీపీలో ఇబ్బంది తలెత్తింది. చిలకలూరిపేట ఇన్‌చార్జ్‌గా ఎన్‌ఆర్‌ఐ రజనీని ప్రకటించి… మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టడంతో కొద్ది రోజుల క్రితం దుమారం లేచింది. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ వివాదం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటు తనదేనన్న భావనతో లేళ్ల అప్పిరెడ్డి ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ను కాదని… ఇటీవలే పార్టీలో చేరిన మాజీ పోలీస్ అధికారి ఏసురత్నంను ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించారు. దీంతో అప్పిరెడ్డి […]
గుంటూరు జిల్లాకు చెందిన మరో నియోజకవర్గ వైసీపీలో ఇబ్బంది తలెత్తింది. చిలకలూరిపేట ఇన్‌చార్జ్‌గా ఎన్‌ఆర్‌ఐ రజనీని ప్రకటించి… మర్రి రాజశేఖర్‌ను పక్కన పెట్టడంతో కొద్ది రోజుల క్రితం దుమారం లేచింది.
ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ వివాదం ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ సీటు తనదేనన్న భావనతో లేళ్ల అప్పిరెడ్డి ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన్ను కాదని… ఇటీవలే పార్టీలో చేరిన మాజీ పోలీస్ అధికారి ఏసురత్నంను ఇన్‌చార్జ్‌గా జగన్ నియమించారు. దీంతో అప్పిరెడ్డి వర్గం అవాక్కయింది.
అదేంటి ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన అప్పిరెడ్డిని కాదని… ఏసురత్నంకు ఎలా ఇన్‌చార్జ్ ఇస్తారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పార్టీలో అసలేం జరుగుతోందని… ఏ ప్రాతిపదికన ఇన్‌చార్జ్‌గా నియమిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పరిణామంపై అప్పిరెడ్డి స్పందించారు. తన వర్గం వారు ఎవరూ తొందరపడి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దన్నారు.
తనను కలిసిన అనుచరులతో మాట్లాడుతూ… మరో నాలుగు రోజులు అందరూ మౌనంగా ఉండాలని కోరారు. అందరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పారు. అభిమానులెవరూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అందరితో మాట్లాడిన తర్వాత అనుచరులు,అభిమానులు చెప్పినట్టు తాను నడుచుకుంటానని అప్పిరెడ్డి వివరించారు.