జగిత్యాలలో 'ప్రేమదేశం' ప్రేమకథ విషాదం !
ఇద్దరూ టెన్త్ విద్యార్థులు…ఒకే స్కూల్… ఒకే క్లాస్…ఆ క్లాస్‌లో చదివిన అమ్మాయిని ప్రేమించారు. కానీ ఆమెకు తమ ప్రేమను చెప్పుకోలేకపోయారు. చివరకు ఇద్దరు సంఘర్షణ పడ్డారో ఏమో తెలియదు. కానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ప్రేమదేశం సినిమా వచ్చి 20 ఏళ్లు దాటిపోయింది. కానీ ఇంకా ఆ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు జరుగుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఆర్య సినిమా వచ్చింది. నిన్నుకోరి లాంటి మ్యెచూర్డ్ లవ్‌స్టోరీలు వచ్చాయి. కానీ ఇప్పటి యూత్ ఆలోచనలు మాత్రం ఇంకా […]
ఇద్దరూ టెన్త్ విద్యార్థులు…ఒకే స్కూల్… ఒకే క్లాస్…ఆ క్లాస్‌లో చదివిన అమ్మాయిని ప్రేమించారు. కానీ ఆమెకు తమ ప్రేమను చెప్పుకోలేకపోయారు. చివరకు ఇద్దరు సంఘర్షణ పడ్డారో ఏమో తెలియదు. కానీ ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
ప్రేమదేశం సినిమా వచ్చి 20 ఏళ్లు దాటిపోయింది. కానీ ఇంకా ఆ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలు జరుగుతున్నాయనడానికి ఇదో ఉదాహరణ. ఆర్య సినిమా వచ్చింది. నిన్నుకోరి లాంటి మ్యెచూర్డ్ లవ్‌స్టోరీలు వచ్చాయి. కానీ ఇప్పటి యూత్ ఆలోచనలు మాత్రం ఇంకా మారడం లేదు. ఇందుకు ఉదాహరణే జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రేమకథ !
జగిత్యాల టౌన్‌కు చెందిన మహేందర్, రవితేజ ఇద్దరూ క్లాస్‌మెట్స్. టెన్త్ చదువుతున్నారు. ఇద్దరూ తమ క్లాస్‌లో చదువుకునే అమ్మాయిని ప్రేమించారు. అయితే ఈ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పలేదు. ఇద్దరూ తమలోనే దాచుకున్నారు. ప్రేమ విషయాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు.
ఆదివారం రోజు పార్టీ చేసుకుని… క్షణికావేశంలో సినిమా సీన్ తలపించేలా ఇద్దరూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. బాధ తట్టుకోలేక అరుపులు.. కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మహేందర్ చనిపోయాడు. రవితేజ కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఇద్దరు స్డూడెంట్స్ మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే కారణమా? ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మందుపార్టీలో ఇంకా ఏదైనా గొడవ జరిగిందా? అనే విషయాలను ఆరా తీస్తున్నారు.
అయితే వీళ్ళిద్దరే కాక మరో స్నేహితుడితో కలిసి మందుకొట్టారని…. మాటా మాటా పెరిగి ఒకరిమీద మరొకరు పెట్రోల్ చల్లి ఒకళ్ళనొకళ్ళు తగలబెట్టుకున్నారని మరో సమాచారం. మూడో వ్యక్తిని పోలీసులు విచారిస్తే తప్ప అసలు విషయం వెలుగులోకి రాదు.