డేటింగ్ లేడీస్.... మగ పుంగవులతో ఆడుకున్నారు....
పది నిమిషాల సుఖాన్నే ఆశగా చూపిందో ముఠా. మగధీరులను బుట్టలో వేసుకోవడం చాలా సులువని నమ్మి పెద్ద స్కెచ్చే వేసింది. మూడు వెబ్ సైట్లను ప్రారంభించి చెలరేగిపోయింది. ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టేశారు. కానీ బాధితులు ఎక్కువైపోయేసరికి చివరికి దొరికిపోయారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ ముఠాకు నాయకుడు దేబాశిష్ ముఖర్జీ. చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాడు. కోటీశ్వరుడు కావాలనే ఆశతో తన స్నేహితులు హౌరాకు చెందిన అనితా డే, […]
పది నిమిషాల సుఖాన్నే ఆశగా చూపిందో ముఠా. మగధీరులను బుట్టలో వేసుకోవడం చాలా సులువని నమ్మి పెద్ద స్కెచ్చే వేసింది. మూడు వెబ్ సైట్లను ప్రారంభించి చెలరేగిపోయింది. ఏకంగా రూ.150 కోట్లు కొల్లగొట్టేశారు. కానీ బాధితులు ఎక్కువైపోయేసరికి చివరికి దొరికిపోయారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ ముఠాకు నాయకుడు దేబాశిష్ ముఖర్జీ. చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాడు. కోటీశ్వరుడు కావాలనే ఆశతో తన స్నేహితులు హౌరాకు చెందిన అనితా డే, సిలిగురికి చెందిన నీతా శంకర్, కోల్ కతాకు చెందిన ఫెయిజుల్ హక్, సందీప్ మిత్రాలను సంప్రదించి ప్లాన్ ను ఆచరణలో పెట్టాడు. వరల్డ్ డేటింగ్.కామ్, గెట్ యూత్ లేడి.కామ్, మై లవ్18.ఇన్ వెబ్ సైట్లను ప్రారంభించారు. అందమైన అమ్మాయిలు, ఆంటీల సెక్సీ ఫొటోలను అప్ లోడ్ చేసి ఉంచారు. వీటిని చూసిన కుర్రకారు, నడి, మలి వయసు మగవాళ్లు మనసు పారేసుకొని రిజిస్టర్ అయిపోయారు.
తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1080తో మొదలై, విడతలవారీగా డబ్బులు గుంజడం మొదలు పెడతారు. కోల్ కతాలోని ఓ ఎరువుల దుకాణం పేరిట గోదామును అద్దెకు తీసుకొని కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది అమ్మాయిలను ఉద్యోగులుగా నియమించారంటే వీరి దోపిడి ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోగానే అమ్మాయి ఫోన్ చేసి కబుర్లు చెబుతుంది. ఇలా క్లబ్ లైసెన్స్, వివిధ సర్వీసుల పేరుతో ఖాతాల్లో నగదు జమ చేసుకుంటుంటారు. వీరి ఒక్క రోజు ఆదాయం రూ.20 లక్షలని పోలీసులు నిర్థారించారు.
సైబరాబాద్ కు చెందిన యువకుడు గెట్ యువర్ లేడి.కామ్ వెబ్ సైట్లో రిజిస్టర్ అయ్యాడు. రూ.15,19,614 లను తన ఖాతా నుంచి విడతల వారీగా బదిలీ చేశాడు. కాల్ సెంటర్‌లో చెప్పిన వివరాల మేరకు గంటల కొద్ది అమ్మాయి వస్తుందని ఎదురుచూస్తూ ఉండిపోయాడు. చివరికి ఎవరూ రాకపోవడంతో నిరాశ, ఆగ్రహంతో మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దృష్టి పెట్టిన పోలీసులు విషయాన్నంతా ఆరా తీశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.