నిర్మలా సీతారామన్‌కు ఆప్ లీగల్ నోటీసులు
రాఫెల్ డీల్‌లోని అవకతవకలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లీగల్ నోటీసు పంపారు. రాఫెల్ డీల్‌ను రద్దు చేయాలని… రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయకుండా డాసల్ట్ రిలయెన్స్ ఏరోస్పేస్‌ను కట్టడి చేయాలని కోరారు. ఈ డీల్ విషయమై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఎటువంటి అనుభవం లేని కంపెనీని […]
రాఫెల్ డీల్‌లోని అవకతవకలపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్‌గా ఉంది. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లీగల్ నోటీసు పంపారు. రాఫెల్ డీల్‌ను రద్దు చేయాలని… రాఫెల్ ఫైటర్ జెట్లు తయారు చేయకుండా డాసల్ట్ రిలయెన్స్ ఏరోస్పేస్‌ను కట్టడి చేయాలని కోరారు. ఈ డీల్ విషయమై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
ఎటువంటి అనుభవం లేని కంపెనీని స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌గా ఎంపిక చేయడం, రాఫెల్ యుద్ద విమానాల ధర విషయంలో ఆమె మాటలకు, చేతలకు పొంతన లేకుండా ఉందని సంజయ్ సింగ్ లాయర్ పేర్కొన్నారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగేలా నిర్మలా సీతారామన్ వ్యవహరించారని… అందుకే ఆమెకు లీగల్ నోటీసు ఇస్తున్నామని లాయర్ స్పష్టం చేశారు. మరో 3 రోజుల్లో తన డిమాండ్లపై దృష్టి సారించకపోతే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాఫెల్ డీల్‌లో 36 వేల కోట్ల మెగా స్కామ్ జరిగిందని ఆరోపించిన సంజయ్ సింగ్…. పార్లమెంట్‌లో ఈ విషయం ప్రస్తావించినప్పుడు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బూమ్రే పొంతన లేని సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు.
78 సంవత్సరాల అనుభవం కలిగిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని…12 రోజుల అనుభవం కలిగిన రిలయెన్స్ కంపెనీని ఎందుకు ఎంపిక చేశారని తాను వేసిన ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం రాలేదని ఆయన గుర్తుచేశారు.