అక్రమ క్వారీయింగ్ వల్లే ఇదంతా జరిగింది
మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశం పై నోరు విప్పారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో పలు విషయాలపై స్పందించారు. ఏపీ రాజకీయాల్లోకి తప్పకుండా త్వరలో వస్తానని, ఆ విషయమై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీబీఐ ప్రత్యేకాధికారిగా ఇక్కడ నియమించబడ్డారు. ఆ తరువాత కొన్నాళ్లకు కనుమరుగయ్యారు. ఆయన చెప్పిన ఏ అంశం జగన్ పై ఇప్పటి వరకు నిరూపణ కాలేదు. ఆంధ్రాకు […]
మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశం పై నోరు విప్పారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో పలు విషయాలపై స్పందించారు. ఏపీ రాజకీయాల్లోకి తప్పకుండా త్వరలో వస్తానని, ఆ విషయమై సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీబీఐ ప్రత్యేకాధికారిగా ఇక్కడ నియమించబడ్డారు. ఆ తరువాత కొన్నాళ్లకు కనుమరుగయ్యారు. ఆయన చెప్పిన ఏ అంశం జగన్ పై ఇప్పటి వరకు నిరూపణ కాలేదు.
ఆంధ్రాకు దూరంగా విధులు నిర్వహిస్తూ మహారాష్ట్రలో ఉన్నా…. ఆయన అడపా దడపా ఇక్కడకు వస్తూనే ఉన్నారు. ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తరువాత ఆయన ఏపీలోని అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు. రైతులను చైతన్య పరుస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు. యువ రైతులను, యువకులను ఉత్సాహపరుస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు కూడా అందాయి. దేనిపై స్పష్టంగా స్పందించని ఆయన ఎట్టకేలకు తన మనసులోని మాటలను బయట పెట్టారు. త్వరలో రాజకీయ ప్రవేశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతాంగ సమస్యలు తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశమేనని చెప్పారు.
అలాగే అరకులో జరిగిన మావోయిస్టుల దాడిని ఖండించారు. అక్రమ క్వారీయింగ్ వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఆయన నర్మగర్భంగా బయటపెట్టారు. ఇలా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై నోరు విప్పిన ఆయన పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.