అరకు ఎమ్మెల్యేను కాల్చి చంపిన మావోయిస్టులు

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. మావోయిస్టులు ఆయన్ను కాల్చిచంపారు. ఘటన స్థలిలోనే ఆయన కన్నుమూశారు. విశాఖ జిల్లాలో ఈ దాడి జరిగింది. చాలా కాలంగా మావోయిస్టులు సర్వేశ్వరరావును హెచ్చరిస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు సర్వేశ్వరరావు అండగా ఉంటున్నారన్న ఉద్దేశంతో మావోయిస్టులు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆయనపై దాడి చేశారు. ఘటనాస్థలిలోనే ఎమ్మెల్యే కన్నుమూశారు. మావోయిస్టుల దాడిలో మరో మాజీ ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు. విశాఖ ఏజెన్సీలో సర్వేశ్వరరావు ఒక క్వారీ కూడా […]

Advertisement
Update:2018-09-23 08:23 IST

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. మావోయిస్టులు ఆయన్ను కాల్చిచంపారు. ఘటన స్థలిలోనే ఆయన కన్నుమూశారు. విశాఖ జిల్లాలో ఈ దాడి జరిగింది.

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు

చాలా కాలంగా మావోయిస్టులు సర్వేశ్వరరావును హెచ్చరిస్తున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు సర్వేశ్వరరావు అండగా ఉంటున్నారన్న ఉద్దేశంతో మావోయిస్టులు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు ఆయనపై దాడి చేశారు. ఘటనాస్థలిలోనే ఎమ్మెల్యే కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ

మావోయిస్టుల దాడిలో మరో మాజీ ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు. విశాఖ ఏజెన్సీలో సర్వేశ్వరరావు ఒక క్వారీ కూడా నిర్వహిస్తున్నారు. దాని విషయంలోనూ గిరిజనులకు, ఎమ్మెల్యేకు మధ్య వివాదం నడుస్తోంది. నలుగురు మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. 2014లో వైసీపీ తరపున గెలిచిన సర్వేశ్వరరావు అనంతరం టీడీపీలోకి ఫిరాయించారు.

Tags:    
Advertisement

Similar News