రాజకీయాల నుంచి తప్పుకోవడంపై హరీష్ వివరణ
ప్రజాభిమానం ఈస్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి. హరీష్ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్‌కు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్… హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఆవేదనతోనే హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. సిద్దపేట నుంచి హరీష్ ను తప్పించి కేసీఆర్ ఈసారి పోటీ చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో […]
ప్రజాభిమానం ఈస్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.
హరీష్ వ్యాఖ్యలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేటీఆర్‌కు ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్… హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఆవేదనతోనే హరీష్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.
సిద్దపేట నుంచి హరీష్ ను తప్పించి కేసీఆర్ ఈసారి పోటీ చేయబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు హరీష్ రావు వివరణ ఇచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందేమోనన్న వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని హరీష్ వివరణ ఇచ్చారు.
ప్రజాభిమానం చూసి భావోద్వేగానికి లోనై మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. టీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యత లేదన్నది కొందరు పడని వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమేనని హరీష్ రావు వివరించారు.