అంటే బీజేపీ- వైసీపీ కుమ్మక్కు నిజం కాదా?
తాను ఏం చేసినా కరెక్టే… మిగిలిన వారు ఏమీ చేయకున్నా తప్పు చేసినట్టే. ఇది టీడీపీ తీరు, దాని అధినేత తీరు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పై ప్రజలకు పీకల్లోతు కసి ఉన్నప్పుడు వైసీపీ- కాంగ్రెస్ ఒక్కటే అంటూ ప్రచారం చేశారు చంద్రబాబు. వైసీపీని పిల్ల కాంగ్రెస్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అని ప్రచారం చేశారు. ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరవుతూ… బీజేపీతో వైసీపీకి సంబంధాలున్నాయని ప్రచారం మొదలుపెట్టారు. గతంలో […]
తాను ఏం చేసినా కరెక్టే… మిగిలిన వారు ఏమీ చేయకున్నా తప్పు చేసినట్టే. ఇది టీడీపీ తీరు, దాని అధినేత తీరు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పై ప్రజలకు పీకల్లోతు కసి ఉన్నప్పుడు వైసీపీ- కాంగ్రెస్ ఒక్కటే అంటూ ప్రచారం చేశారు చంద్రబాబు. వైసీపీని పిల్ల కాంగ్రెస్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే అని ప్రచారం చేశారు.
ఇప్పుడు బీజేపీతో తెగదెంపులు చేసుకున్న చంద్రబాబు కాంగ్రెస్‌కు దగ్గరవుతూ… బీజేపీతో వైసీపీకి సంబంధాలున్నాయని ప్రచారం మొదలుపెట్టారు. గతంలో వైసీపీకి ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అని చెబుతున్నారు.
వైసీపీ- బీజేపీ మధ్య రహస్య స్నేహముందని ప్రచారం చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాత్రం అందుకు భిన్నంగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి బాండ్లపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన కుటుంబరావు… పనిలో పనిగా వైసీపీపైనా కొన్ని ఆరోపణలు చేశారు.
రెండు మూడు వారాల్లో జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన బాగోతాలన్నీ బయటకు వస్తాయని.. అవి జాతీయ మీడియాలో ప్రసారం అవుతాయని చెప్పారు. బీజేపీకి చెందిన ఒక లీడింగ్ మేగజైన్ లో కథనాలు రాబోతున్నాయని చెప్పారు. బీజేపీ కుంభకోణాలపై గతంలో తాను చెప్పినట్టు పత్రికల్లో ఇప్పటికే కథనాలు వచ్చేశాయని చెప్పారు.
అయితే ఒకవైపు చంద్రబాబు ఏమో బీజేపీ- వైసీపీ కుమ్మక్కు అయ్యాయని ప్రచారం చేస్తుంటే చంద్రబాబు మనిషి కుటుంబరావు మాత్రం జగన్‌కు వ్యతిరేకంగా బీజేపీకి చెందిన మేగజైన్‌లో కథనాలు వస్తాయని చెప్పడం ఆసక్తిగానే ఉంది. బీజేపీ మేగజైన్‌లో ఏమొస్తుందో కూడా కుటుంబరావు చెప్పగలుగుతున్నారంటే ఎవరికి ఎవరితో సంబంధాలున్నాయో అర్థం అవుతోందని కొందరు వైసీపీ నాయకులు అంటున్నారు.